ASBL NSL Infratech

సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న తెలంగాణ గవర్నర్

సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న తెలంగాణ గవర్నర్

మేడారం సమ్మక్క-సారలమ్మను తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించారు. గవర్నర్‌కు ములుగు ఎమ్మెల్యే సీతక్క స్వాగతం పలికారు. అయితే గవర్నర్‌ తమిళిసైకి స్వాగతం పలికేందుకు మంత్రులు రాలేదు. తన రాక సందర్భంగా భక్తులను ఆపడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ప్రజలందరి సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలిపారు. సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న గవర్నర్‌  అమ్మ దీవేనలు ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నానని తెలిపారు. వన దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం గవర్నర్‌ మీడియాతో మాట్లాడుతూ భక్తులతో కలిసి అమ్మవార్లను దర్శించుకోవాలనుకున్నాను. రాష్ట్ర గవర్నర్‌గా నాకు ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అగలేదు. అయితే ప్రొటోకాల్‌ ప్రకారం అధికారులు ఏర్పాట్లు చేసి ప్రత్యేకంగా దర్శనం కల్పించారు. నేను ప్రజల్లో ఒకదానిగా ఉండాలని అనుకుంటున్నా. సాధారణ భక్తుల మాదిరిగానే సమ్మక్క సారలమ్మను దర్శించుకోవాలన్నది నా ఆకాంక్ష అన్నారు. అందరినీ కలిసి ఇక్కడి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకునేందుకే హెలికాప్టర్‌లో కాకుండా రోడ్డు మార్గంలో వచ్చాను. నా పర్యటన వల్ల సాధారణ భక్తులు అసౌకర్యానికి గురైతే నన్ను మన్నించాలన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :