ASBL NSL Infratech

వచ్చే ఎన్నికల్లో మీ జీవితాలు మార్చే బటన్ నొక్కండి : చంద్రబాబు

వచ్చే ఎన్నికల్లో మీ జీవితాలు మార్చే బటన్ నొక్కండి : చంద్రబాబు

కూటమి ప్రభుత్వం రాగానే అంగన్‌వాడీలు, హోంగార్డులు, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడారు. జగన్‌ నవతరత్నాలు, నవమోసాలు అయ్యాయని దుయ్యబట్టారు.  గులకరాయితో హత్యాయత్నం చేశానని నాపై నింద వేశారు. కోడి కత్తి కేసులోనూ ఇలాంటి ఆరోపణలే చేశారు. బ్యాండేజ్‌ తీయకుండా డ్రామాలు చేద్దామని జగన్‌ అనుకున్నారు. అందరూ హేళన చేయడంతో ఇవాళ బ్యాండేజ్‌ తీసేశారు. గాయం కనపడిరదా? అని ఎద్దేవా చేశారు. 

సీఎం జగన్‌ రూ.14 లక్షల కోట్లు అప్పు చేశారు. పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పి గోదావరిలో కలిపారు. వారంలోగా సీపీఎస్‌ రద్దు చేస్తానన్న హామీ నెరవేరిందా? రాష్ట్రంలో ఉత్తరకొరియా పరిస్థితి నెలకొంది. ఉద్యోగాలు ఇస్తామనే హామీ వైసీపీ మేనిఫెస్టోలో లేదు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాగానే తొలి సంతకం డీఎస్పీ పైనే.  ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం చేస్తా. తల్లికి వందనం కింద ప్రతి పిల్లవాడికి ఏటా రూ.15వేలు ఇస్తా. ఆత్మకూరు సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. వచ్చే ఎన్నికల్లో మీ జీవితాలు మార్చే బటన్‌ నొక్కండి. రాష్ట్రంలో దొంగలు పడ్డారు.  రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ ఎన్నికలు మన భవిష్యత్‌ను మార్చబోతున్నాయి అని అన్నారు.

మేం వస్తే అభివృద్ధి. వైసీపీ వస్తే అరాచకం. మా పాలన స్వర్ణయుగం. వైసీపీ పాలన రాతియుగం. సీఎం జగన్‌ ఇవాళ చేతులెత్తేశారు. వైసీపీ మేనిఫెస్టోతో పోలిస్తే, మా  మేనిఫెస్టో సూపర్‌ సక్సెస్‌. చంద్రబాబు అంటే అభివృద్ధికి బ్రాండ్‌. నేరాలు, ఘోరాలు చేయడంలో జగన్‌ పీహెచ్‌డీ చేశారు. వైసీపీ మేనిఫెస్టోలో రైతులకు ఏమీ చెప్పని దుర్మార్గుడు జగన్‌. తన మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ అని అన్నారు.  అందులో హామీలను నెరవేర్చారా? మద్య నిషేధం చేస్తానన్న హామీ ఏమైంది? స్వార్థం కోసం మహిళల తాలిబొట్లు తెంపేసిన వ్యక్తి జగన్‌ అని విమర్శించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :