ASBL NSL Infratech

అరుదైన బ్లాక్ యాపిల్స్.. ధర తెలిస్తే షాకే!

అరుదైన బ్లాక్ యాపిల్స్.. ధర తెలిస్తే షాకే!

ఆరోగ్యానికి యాపిల్స్‌ చాలా మంచిది. మనం ఇప్పటి వరకు రెడ్‌ యాపిల్స్‌, గ్రీన్‌ యాపిల్స్‌ను మాత్రమే చూశాం. తిన్నాం.యాపిల్‌ జాతుల్లోనే ఈ పండుకు చాలా ప్రత్యేకత ఉంది. బ్లాక్‌ రంగులో ఉండే యాపిల్స్‌ చాలా ఖరీదైనవి. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే ఎన్నో రకాల రోగాలను నయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి కేవలం చైనా, టిబెట్‌లోని పర్వత ప్రాంతాల్లో మాత్రమే పండుతాయి. వీటిని బ్లాక్‌ డైమండ్‌ యాపిల్స్‌ అని కూడా పిలుస్తారు. పైన నల్లగా ఉన్నా లోపల మాత్రం సాధారణ యాపిల్‌ పండులాగే తెల్లగా ఉంటుంది. ఈ పండును చూడగానే తినేయాలనిపించేలా నిగనిగలాడుతూ ఉంటుంది. ఇక దీని ఖరీదు విషయానికి వస్తే ఒక్కో పండు రూ.500 వరకు ఉంటుంది. ఈ యాపిల్‌కు మరో ప్రత్యేకత కూడా ఉందండోయ్‌. సాధారణంగా యాపిల్‌ చెట్లు రెండు మూడేళ్లలోనే కాపు మొదలు పెడతాయి. అయితే బ్లాక్‌ యాపిల్‌ తొలి పంట చేతికందడానికే కనీసం 8 ఏళ్ల  సమయం పడుతుందట.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :