ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అమెరికా జాయింట్ చీఫ్స్ చైర్మన్ గా సి.క్యూ. బ్రౌన్

అమెరికా జాయింట్ చీఫ్స్ చైర్మన్ గా సి.క్యూ. బ్రౌన్

వైమానిక దళాధికారి జనరల్‌ సి.క్యూ. బ్రౌన్‌ జూనియర్‌ను తదుపరి జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ చైర్మన్‌గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఎంపిక చేశారు. ఈ మేరకు ఆయన లాంఛనంగా ప్రకటన చేయనున్నారు. ఇది అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ లో అత్యున్నత పదవి. నల్లజాతీయుడైన బ్రౌన్‌కు  చైనాకు సంబందించి విస్తృత అవగాహన ఉంది. ఈ నియామకంతో పెంటగాన్‌లో అత్యున్నత పౌర (రక్షణ మంత్రి), మిలటరీ పదవులను ఏకకాలంలో ఆఫ్రికన్‌ అమెరికన్‌ సంతతి వారు నిర్వహించినట్లవుతుంది. ఇలా జగరడం ఇదే మొదటిసారి. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టన్‌ కూడా నల్లజాతీయుడే. ప్రస్తుత జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ మార్క్‌ మిల్లే పదవీకాలం ఈ ఏడాది అక్టోబరులో ముగియనుంది. ఆ తర్వాత బ్రౌన్‌ ఆ బాద్యతలు చేపడతారు. ఆయన వాయుసేనలో పలు కీలక పదవులు నిర్వర్తించారు. ఐరోపా, పశ్చిమాసియా, ఆసియాలో పనిచేశారు. ఆయన ఎఫ్‌`16 యుద్ధ విమాన పైలట్‌గా కెరీర్‌ ప్రారంభించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :