ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

నితీశ్‌ను విపక్షాలు నమ్ముతాయా..? ఆయన అందరివాడు అనిపించుకుంటారా..?

నితీశ్‌ను విపక్షాలు నమ్ముతాయా..? ఆయన అందరివాడు అనిపించుకుంటారా..?

ప్రస్తుతం దేశంలో బీజేపీని కొట్టే ఏకైక పార్టీ లేనే లేదు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నా.. ఆ పార్టీ బాగా వీక్ అయిపోయింది. చాలా రాష్ట్రాల్లో అధికారానికి దూరమైంది. కేడర్ కూడా చిన్నాభిన్నమైపోయింది. ఇదే అదనుగా బీజేపీ జులం విదుల్చుతోంది. అన్ని రాష్ట్రాలనూ కబ్జా చేసుకుంటూ పోతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తోంది. అయితే బీజేపీని ఇలాగే వదిలేస్తే ప్రమాదకరమని విపక్షాలన్నీ ఘంటాపథంగా చెప్తున్నాయి. అయితే ఏ ఒక్క పార్టీకో బాధ్యతలు ఇచ్చేందుకు కానీ, కాంగ్రెస్ నాయకత్వాన్ని సమర్థించేందుకు కానీ విపక్షాలు సిద్ధంగా లేవు. అందుకే ఎవరో ఒకరు లీడ్ తీసుకోవాలని డిసైడయ్యారు.

కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో పని చేసేందుకు చాలా పార్టీల నేతలు సిద్ధంగా లేరు. ఇందుకు అనేక కారణాలున్నాయి. రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలతో ఫైట్ చేస్తున్నాయి. అలాంటప్పుడు కాంగ్రెస్ తో కలిసి వెళ్తే ఇబ్బందులు వస్తాయేమోననే భయం కొన్ని పార్టీలకు ఉంది. అయితే బీజేపీని కొట్టాలంటే కాంగ్రెస్ తో జాతీయ స్థాయిలో కలవక తప్పని పరిస్థితి ఉంది. అందుకే ఇష్టం లేకపోయినా ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిలో పని చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మాత్రం ఇవి వ్యతిరేకిస్తున్నాయి. అందుకే అందరికీ ఆమోదయోగ్యుడైన ఒక పార్టీ లేదా నేత నేతృత్వంలో విపక్షాలన్నింటినీ ఏకతాటి పైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్య జేడీయూ అధినేత నితీశ్ కుమార్ దగ్గరయ్యారు. బీహార్లో ఆ పార్టీతో కలిసి పని చేస్తున్నారు. అంతేకాక బీజేపీ నమ్మకద్రోహం చేసిందని నితీశ్ కుమార్ ఆగ్రహంతో ఉన్నారు. అందుకే బీజేపీకి వ్యతిరేకంగా అందరినీ ఏకం చేసే బాధ్యతను తీసుకునేందుకు ముందుకొచ్చారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులతో భేటీ అనంతరం అందరినీ ఒక్కటి చేసేందుకు నితీశ్ కుమారే కరెక్ట్ అని అభిప్రాయపడ్డారు. ఆయన కూడా సంసిద్ధత వ్యక్తం చేయడంతో మార్గం సుగమం అయింది. దేశవ్యాప్తంగా తిరిగి బీజేపీయేతర పార్టీలన్నింటినీ కలుపుతానని నితీశ్ కుమార్ వెల్లడించారు.

అయితే నితీశ్ కుమార్ మాటను ఎంతమంది అంగీకరిస్తారనేది పెద్ద ప్రశ్న. మమత బెనర్జీ, అరవింద్ కేజ్రివాల్, కేసీఆర్ లాంటి నేతలు హస్తినలో చక్రం తిప్పాలనుకుంటున్నారు. వీళ్లంతా నితీశ్ సారథ్యంలో పని చేసేందుకు ఓకే చెప్తారా అనేది డౌటే. ఒకవేళ ఇప్పుడు ఓకే చెప్పినా తర్వాత కలిసి ఉంటారని చెప్పలేం. బీజేపీ కూడా ఈ కూటమిని చీల్చేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తుంటుంది. మరి ఇలాంటి వాటన్నింటినీ తట్టుకుని నితీశ్ ఎలా నడిపిస్తారనేది చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :