ASBL NSL Infratech

ఏపీ ఉద్యోగులకు మేలు చేసిన ముఖ్యమంత్రి ఎవరు? జగన్…లేక చంద్రబాబు…

ఏపీ ఉద్యోగులకు మేలు చేసిన ముఖ్యమంత్రి ఎవరు? జగన్…లేక చంద్రబాబు…

ఏపీలో ఎన్నికలు జరగడానికి గట్టిగా పది రోజుల సమయం ఉంది.. ఈలోపు పార్టీలు తమ ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నాయి. ఏపీలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరు కూడా చంద్రబాబుకు ఓటు వేసే పరిస్థితి కనిపించడం లేదు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలలో కూటమిపై అంత సానుకూలత కనిపించడం లేదు. ఈ దశలో అందరి దృష్టి యువత, ఉద్యోగస్తుల పై మళ్లింది. మేనిఫెస్టోలో విడుదల చేసిన నేపథ్యంలో ఉద్యోగుల సంక్షేమాల గురించి ప్రస్తావన వస్తుంది. అయితే నిజంగా ఉద్యోగులకు మేలు చేసిన ముఖ్యమంత్రి ఎవరు? అన్న విషయంపై కూడా జోరుగా చర్చ జరుగుతుంది. చంద్రబాబు హయాంలో ఉద్యోగస్తులపై తీవ్రమైన పని ఒత్తిడి ఉండేది. జన్మభూమి కమిటీ మీటింగ్ లలో.. చోటా బడా నేతలు కూడా ఉద్యోగస్తులను నోటికి వచ్చినట్టు తిట్టేవారు. ఇప్పుడు పెరగని డిఏ గురించి మాట్లాడే చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు నాలుగు పెండింగ్ డిఏల విషయంలో మౌనం వహించారు. ఆనాడు చంద్రబాబు.. కావాలంటే ప్రతిపక్షంలో కూర్చుంటాను కానీ డిఏలు అస్సలు పెంచను అని తెగేసి చెప్పారు. మరి ఇప్పుడు ఉద్యోగస్తుల కోసం పాటుపడ్డాను అని మాట్లాడుతున్నారు. ఇక జగన్ విషయానికి వస్తే.. జగన్ వచ్చిన తర్వాత ఉద్యోగస్తులపై ఒత్తిడి కాస్త తగ్గింది. అంతేకాదు 10,177 మంది ఉద్యోగుల్ని జగన్ కాలంలో రెగ్యులరైజ్‌ చేశారు. 1.35 లక్షలమందిని సచివాలయాల్లో నియమించారు. ఉద్యోగస్తుల పదవీ విరమణ కాలం 62 సంవత్సరాలకు పెంచారు. డిఏ విషయంలో కూడా జగన్ చంద్రబాబు లాగా మూర్ఖంగా మాట్లాడడం లేదు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల రీత్యా కాస్త సర్దుకోమంటున్నారు కానీ అసలు ఇవ్వము అని చెప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రాలో ఉద్యోగస్తులు ఎవరిపక్క ఓటు వేస్తారో త్వరలో తేలిపోతుంది. 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :