ASBL NSL Infratech

టిటిఎ కన్వెన్షన్‌కు రండి.. మంత్రులు, అధికారులకు, ఇతరులకు ఆహ్వానాలు

టిటిఎ కన్వెన్షన్‌కు రండి.. మంత్రులు, అధికారులకు, ఇతరులకు ఆహ్వానాలు

సియాటెల్‌లో జరగనున్న టీటీఏ మెగా కన్వెన్షన్‌లో పాల్గొనాల్సిందిగా పలువురు ప్రముఖులను ఇండియాకు వచ్చిన టిటిఎ ప్రతినిధులు స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. టీటీఏ ప్రెసిడెంట్‌ వంశీరెడ్డి కంచరకుంట్ల, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ నవీన్‌ రెడ్డి మల్లిపెద్ది, కన్వెన్షన్‌ రీజనల్‌ అడ్వైజర్స్‌ డాక్టర్‌ ద్వారకానాథ రెడ్డి, నవీన్‌ గోలి, సీఈసీ ఈవీపీ డాక్టర్‌ ఎల్‌ఎన్‌ రెడ్డి దొంతిరెడ్డితోపాటు ఈసీ, బీవోడీ జ్యోతి రెడ్డి దూదిపాల, బీవోడీ దుర్గాప్రసాద్‌ సెలోజ్‌ తదితరులు కలిసి టీటీఏ మెగా కన్వెన్షన్‌లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.

సియాటెల్‌లో జరగనున్న తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ మెగా కన్వెన్షన్‌లో పాల్గొనాల్సిందిగా మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌బాబులను టిటిఎ నాయకులు కలిసి ఆహ్వానించారు. అలాగే ఎఐజి ఆసుపత్రి అధినేత డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డిని కూడా టిటిఎ నాయకులు ఆహ్వానించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌రావు, మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌, టూరిజం అండ్‌ కల్చర్‌, స్పోర్ట్స్‌ సెక్రటరీ శైలజ అయ్యర్‌, మరో ఐఎఎస్‌ అధికారి హనుమంతరావును, మాజీ గవర్నర్‌, బిజెపి నాయకురాలు తమిళిశై సౌందర్‌రాజన్‌ను, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను బిజినెస్‌ ప్రముఖులు విజయ్‌ భాస్కర్‌ రెడ్డి, ఐఆర్‌ఎ రియాల్టీ గ్రూపు అధినేతలు నర్సిరెడ్డి, వీరారెడ్డితోపాటు ఇతరులను కూడా కలిసి కన్వెన్షన్‌కు రావాల్సిందిగా టిటిఎ నాయకులు ఆహ్వానించారు. 

మే నెల 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు టీటీఏ మెగా కన్వెన్షన్‌ జరగనుంది. సియాటెల్‌లో జరగనున్న ఈ వేడుకల్లో పాల్గొనాలని అనుకునే వారు  ఈ వేడుకల్లో ఎన్నో ఉత్సాహవంతమైన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :