ASBL NSL Infratech

నెక్ట్స్ ఏంటి నీల్?

నెక్ట్స్ ఏంటి నీల్?

గ‌తేడాది డిసెంబ‌ర్ లో రిలీజైన స‌లార్ పార్ట్ త‌ర్వాత ఆ సినిమా డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ఏ సినిమాకు ప‌ని చేస్తున్నాడ‌నేది ఇప్ప‌టికీ స‌స్పెన్స్ గానే ఉంది. ఓ వైపు స‌లార్2 అని కొంద‌రంటుంటే, మ‌రికొంద‌రు జూ. ఎన్టీఆర్, మైత్రీ మూవీ మేక‌ర్స్ సినిమా కోసం వ‌ర్క్ చేస్తున్నాడంటున్నారు. ఎన్టీఆర్- నీల్ సినిమా ఈ ఏడాది సెప్టెంబ‌ర్ లో స్టార్ట్ అవుతుంద‌ని వార్త రాగానే ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఒక్క సారిగా ఖంగు తిన్నారు.

ముందు అనుకున్న ప్ర‌కార‌మైతే స‌లార్ పార్ట్2 సెట్స్ పైకి వెళ్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ఇలాంటి టైమ్ లో ఎన్టీఆర్ సినిమా సెప్టెంబ‌ర్ లో సెట్స్ పైకి వెళ్తుంద‌నే వార్త డార్లింగ్ ఫ్యాన్స్ ను షాక‌య్యేలా చేసింది. నీల్ ఒకేసారి రెండు సినిమాల‌ను తీసే టైప్ కాదు. కాబ‌ట్టి వీరిద్ద‌రిలో ఎవ‌రి సినిమా ముందు చేస్తాడ‌నేది నీల్ కు మాత్ర‌మే తెలుసు. మొన్నా మ‌ధ్య గోట్ లైఫ్, ఆడు జీవితం ప్ర‌మోష‌న్స్ లో పృథ్వీ రాజ్ సుకుమార్ మాట్లాడుతూ స‌లార్2 స‌మ్మ‌ర్ లోనే మొద‌ల‌వుతుంద‌ని చెప్పాడు. ప్రాక్టిక‌ల్ గా చూస్తే ఎన్టీఆర్- నీల్ సినిమా ఇప్ప‌ట్లో వ‌ర్క‌వుట్ అవ‌డం క‌ష్టం.

ప్ర‌స్తుతం వార్2 షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ త‌ర్వాత దేవ‌ర బ్యాలెన్స్ షూట్ ను పూర్తి చేయాల్సి ఉంది. ఆ త‌ర్వాత దేవ‌ర ప్ర‌మోష‌న్స్ అక్టోబ‌ర్ వ‌ర‌కు ఉంటాయి. దేవ‌ర‌2ను ఎక్కువ లేట్ చేయ‌కుండా షూట్ చేయాలి. కాబ‌ట్టి ముందుగా నీల్, ప్ర‌భాస్ తోనే సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుంది. ఏదేమైనా ఈ విష‌యంలో నీల్ క్లారిటీ ఇవ్వాల్సిందే.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :