ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కేసీఆర్ లేఖ వెనుక వ్యూహమేంటి..?

కేసీఆర్ లేఖ వెనుక వ్యూహమేంటి..?

చాలా కాలం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు బహిరంగ లేఖ రాశారు. పద్నాలుగేళ్లలో పార్టీ ఎదుర్కొన్న కష్టనష్టాలను గుర్తు చేస్తూ సాగిందీ లేఖ. పార్టీ పురుడు పోసుకుంది మొదలు ఇప్పటి దాకా ఎన్నో ఆటుపోట్లను పార్టీ చవి చూసిందని.. వాటన్నింటిని తట్టుకుని ఈరోజు ఈ స్థాయిలో నిలబడిందని కేసీఆర్ గుర్తు చేశారు. వరుసగా రెండు సార్లు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చిందన్నారు. కులం, మతం అనే భేదం లేకుండా అందరికీ సంపద సృష్టించగలిగిందన్నారాయన. దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచిందన్నారు కేసీఆర్.

తెలంగాణ రాష్ట్రం ఒకటే బాగుంటే సరిపోదని.. దేశం మొత్తం మనలాగే సుభిక్షంగా ఉండాలనేదే ఈ ప్రాంత ప్రజల కోరిక అని కేసీఆర్ అభిలషించారు. అందుకే భారత్ రాష్ట్ర సమితి పేరుతో అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశవ్యాప్తం అవుతున్నామని.. ఇందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఏదైనా కార్యం తలపెడితే దాని అంతు తేల్చే వరకూ నిద్రపోని సమాజం మనదని.. ఇప్పుడు కూడా కేంద్రంలో కిసాన్ సర్కార్ స్థాపించే వరకూ మడమ తిప్పకూడదని చెప్పారు.

దేశాన్ని ఇన్నాళ్లూ పాలించిన బీజేపీ, కాంగ్రెస్ విధానాల వల్ల దేశం అధోగతి పాలైందన్నారు కేసీఆర్. దేశం కోసం బయల్దేరిన బీఆర్ఎస్ పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బరితెగింపుతో దాడులు చేస్తోందని.. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎన్నికల సంవత్సరం కావడంతో పనికి మాలిన పార్టీలు పనిగట్టుకుని దుష్ప్రచారాలు చేస్తున్నాయని.. వాటిని పట్టించుకోకుండా తెలంగాణ సమాజం మరోసారి బీఆర్ఎస్ సర్కార్ ను గెలిపించాలని కోరారు.

అయితే కేసీఆర్ ఇప్పుడు లేఖ రాయడంపై ఆసక్తి నెలకొంది. ఒక వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత విచారణ కొనసాగుతోంది. ఆమెను ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చు. ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ ఈ లేఖ రాశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు.. తాను దేశం కోసం పని చేయడానికి వెళ్తున్నానని.. ఇక్కడ తెలంగాణను కాపాడు కోవాల్సిన బాధ్యత మీదేనన చెప్పడానికే కేసీఆర్ ఈ లేఖ రాశారని పార్టీ నేతలు చెప్తున్నారు. ఏదేమైనా కేసీఆర్ లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :