ASBL NSL Infratech

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు..! కేసీఆర్ ఫ్యామిలీకి చిక్కులు తప్పవా..?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు..! కేసీఆర్ ఫ్యామిలీకి చిక్కులు తప్పవా..?

ఎక్కడో ఢిల్లీలో మొదలైన లిక్కర్ స్కాం ప్రకంపనలు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. రోజుకొకరిపేరు తెరపైకి వస్తోంది. పలువురు ప్రముఖులు ఇందులో ఇన్వాల్వ్ అయిఉన్నారని బీజేపీ నేతలు చెప్తున్నారు. ముందు ముందు మరింత మంది పేర్లు బయటకు వస్తాయంటున్నారు. మరి ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది.. అసలు ఈ దాడుల వెనుక బీజేపీ స్కెచ్ ఏంటి.. అనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్న అంశం.

ఢిల్లీ లిక్కర్ పాలసీలు అక్రమాలు జరిగాయని బీజేపీ నేతలు ఆరోపించింది మొదలు సీబీఐ రంగంలోకి దిగింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఇల్లు, ఆఫీసులో సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్ జరిగిందని సీబీఐ ప్రకటించడంతో ఈడీ రంగంలోకి దిగింది. అప్పటి నుంచి ఈడీ మంచి దూకుడు ప్రదర్శిస్తోంది. పలు దఫాలుగా ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. పలువురిని విచారించింది. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించినట్లు బీజేపీ పెద్దలు చెప్తున్నారు. వాళ్లు చెప్పినట్లే ఈడీ కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖుల ఆఫీసులు, ఇళ్లలో సోదాలు చేపట్టింది.

హైదరాబాద్ లో ఈడీ ఇప్పటి వరకూ 3 సార్లు సోదాలు నిర్వహించింది. ఇందులో ఎమ్మెల్సీ కవితకు సన్నిహితంగా ఉండే పారిశ్రామికవేత్త రామచంద్ర పిళ్లై, ఆడిటర్ కార్యాలయాలు కూడా ఉన్నాయి. మొదటి విడతలో రామచంద్ర పిళ్లై ఆఫీసులు, ఇళ్లకే పరిమితమైన సోదాలు.. ఆ తర్వాత ఆడిటర్ దగ్గరికి చేరుకున్నాయి. ఆ తర్వాత వెన్నమనేని శ్రీనివాసరావు ఆనే రియల్టర్ వద్దకు చేరాయి. ఈయన కూడా ఎమ్మెల్సీ కవితకు సన్నిహితుడేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

వెన్నమనేని శ్రీనివాసరావు ఆఫీసులు, ఇళ్లలో సోదాలు చేసిన ఈడీ.. పలు కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. 3 దఫాలుగా సోదాలు నిర్వహించిన తర్వాత శ్రీనివాసరావును ఈడీ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం ఇదే తొలిసారి. దీంతో డొంక కదిలిందని ఇంటా బయటా అనుకుంటున్నారు. రాబిన్ డిస్టిలరీస్ సంస్థ ఢిల్లీలో పలు షాపులను దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సంస్థ కో డైరెక్టర్.. వెన్నమనేని శ్రీనివాసరావుకు బావ. శ్రీనివాసరావు కంపెనీల నుంచి పలు దఫాలుగా నగదు ఈ సంస్థకు బదిలీ అయినట్లు తెలుస్తోంది.

శ్రీనివాసరావు ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్ తో శ్రీనివాసరావు సన్నిహితంగా ఉంటారని తెలుస్తోంది. శ్రీనివాసరావు ఆర్థిక మూలాలు ఎక్కడున్నాయి.. ఎవరెవరితో లింకులున్నాయనే విషయం తేలితే ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. శ్రీనివాసరావు ద్వారా కవితకు ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్ పెంచడం, మోదీ సర్కార్ ను ఎలాగైనా గద్దె దించాలని ప్రకటించడం.. లాంటి అనేక పరిణామాలకు బ్రేక్ వేయాలంటే కేసీఆర్ ఫ్యామిలీని ఇరుకున పెట్టడం ఒకటే మార్గమని కేంద్ర పెద్దలు భావించి ఉండొచ్చు. అందుకే ఈడీని రంగంలోకి దించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో!

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :