ASBL NSL Infratech

ఏజెంట్‌కు త‌ప్ప‌ని తిప్ప‌లు

ఏజెంట్‌కు త‌ప్ప‌ని తిప్ప‌లు

అఖిల్‌కు ఏజెంట్ సినిమా త‌న కెరీర్‌లో ఎంతో ఇంపార్టెంట్. అఖిల్, హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను లాంటి వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత అత‌డికి  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ కొంత ఊర‌టనైతే ఇచ్చింది కానీ త‌ను కావాలనుకున్న స‌క్సెస్ మాత్రం అఖిల్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ద‌క్క‌లేదు. దీంతో అఖిల్ ఆశ‌ల‌న్నీ ఏజెంట్‌పైనే పెట్టుకున్నాడు. 

ఏజెంట్ ఫుల్ లెంగ్త్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ కావ‌డం, ఈ సినిమా కోసం అఖిల్ బాడీ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ చేయ‌డం, సురేంద‌ర్ రెడ్డి లాంటి స్టైలిష్ డైరెక్ట‌ర్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు కావ‌డంతో ఈ సినిమా స్టార్టింగ్ నుంచి మంచి అంచ‌నాలే ఉన్నాయి. ఏజెంట్ అఖిల్ ఇమేజ్‌ను పెంచే సినిమా అవుతుంద‌ని కూడా అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆశ‌గా ఉన్నారు. 

ఏజెంట్ మూవీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కంటెంట్ ప‌రంగా పెద్ద‌గా ఏం లీక్ అవ‌లేదు. రిలీజైన ప్రోమోలు మిక్స్డ్ ఫీలింగ్ క‌లిగించాయి. అయితే హీరోయిజం, యాక్ష‌న్ విష‌యంలో మాత్రం నెటిజ‌న్లు ఏజెంట్ విష‌యంలో పెద‌వి విరుస్తున్నారు. ఈ రేంజ్ యాక్ష‌న్ సీన్లని ఇంకా స్టార్ ఇమేజ్ రాని అఖిల్ తో చేయించడాన్ని అంద‌రూ అంగీక‌రించ‌లేక‌పోతున్నారు. కానీ యూత్‌ని ఎట్రాక్ట్ చేయాలంటే ఈ మాత్రం చేయాల్సిందే మూవీ టీమ్ గ‌ట్టిగా కూర్చున్న‌ట్లు క‌నిపిస్తుంది. 

ఏజెంట్ కోసం మంచి రిలీజ్ డేట్‌ను కూడా సెట్ చేసుకున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. అయితే పాన్ ఇండియ‌న్ రేంజ్‌లో రిలీజ్ కానున్న ఏజెంట్‌కు చాలా గ‌ట్టి పోటీనే ఎదురైంది. మ‌ణిరత్నం మూవీ పొన్నియ‌న్ సెల్వ‌న్2 మూవీ కూడా అదే రోజు రిలీజ‌వుతోంది. మ‌ధ్య‌లో ఈ సినిమా పోస్ట్‌పోన్ అవుతుంద‌నే వార్త‌లొచ్చాయి కానీ అందులో వాస్త‌వం లేద‌ని తేలి పోయింది. 

పీఎస్1 తెలుగులో సరిగా పెర్ఫార్మ్ చేయ‌క‌పోయినా, మిగిలిన భాష‌ల్లో ఈ సినిమా చాలా బాగా క‌లెక్ట్ చేసింది. త‌మిళంలో ఇంకే సినిమాకూ ఆ రోజు స్కోప్ ఉండ‌దు. కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, ఉత్త‌రాది రాష్ట్రాల్లోనూ పీఎస్2కు పెద్ద రిలీజే ఉంటుంది. ఒక్క హిందీలో త‌ప్ప ఏజెంట్‌కు ఎక్క‌డా పెద్ద‌గా స్కోప్ ఉండేట్లు క‌నిపించ‌డం లేదు. మ‌రి ఇంత పెద్ద పోటీలో ఏజెంట్ ఏ మాత్రం త‌ట్టుకుంటాడో చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :