ASBL NSL Infratech

టాలెంటెడ్ బ్యూటీకి ల‌క్ క‌లిసొస్తుందా?

టాలెంటెడ్ బ్యూటీకి ల‌క్ క‌లిసొస్తుందా?

అందం, స్పీడు, దానికి మించి యాక్టింగ్.. ఇక డ్యాన్సుల విష‌యంలో అయితే చెప్పాల్సిన ప‌నిలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో మొద‌టి సినిమా హీరో శ్రీకాంత్ కొడుకు రోష‌న్‌తో పెళ్లి సంద‌-డి సినిమాతో అంద‌రి హృద‌యాల్ని గెలుచుకున్న శ్రీ లీల కెరియ‌ర్ సూప‌ర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా దూసుకెళ్తోంది. ఎంత‌లా అంటే రెండో సినిమానే మాస్ మహారాజ ర‌వితేజ స‌ర‌స‌న ఆఫ‌ర్ కొట్టేసేంత‌. ఈ సినిమా రొటీన్ మూవీనే అని విశ్లేష‌కులు అన్నా స‌రే శ్రీ లీల మాత్రం మంచి మార్కులే కొట్టేసింది. 

ఇది శ్రీలీల కెరియ‌ర్‌కు చాలా పెద్ద ప్ల‌స్ కానుంది. నిజం చెప్పాలంటే ధ‌మాకా సినిమా ర‌వితేజ కంటే శ్రీలీలకే మంచి మార్కులు తెచ్చిపెట్టింది. శ్రీ లీల డ్యాన్సులు, బ్యూటీ, చ‌లాకీత‌నం, యాక్టింగ్, సో కాల్డ్ ముంబై హీరోయిన్స్ కంటే బెట‌ర్ గా తెలుగు మాట్లాడ‌గ‌ల‌డం.. ఇలా అన్ని కోణాల్లో ప‌లువురి నుంచి ప్ర‌శంస‌లు అందుకున్న శ్రీ లీల సొగ‌సుకు థియేట‌ర్లో జ‌నాలు మైమ‌ర‌చిపోతున్నారు. 

ఫిల్మ్ న‌గ‌ర్‌లో తాజాగా వినిపిస్తున్న మాట‌ల ప్ర‌కారం, స్టార్ హీరోలంతా ఇప్ప‌టికే శ్రీలీల కోసం త‌మ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు సిఫార‌సు చేస్తున్నారంటే ఈ టాలెంటెడ్ బ్యూటీ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందే తెలుసుకోవ‌చ్చు. ఈ డిసెంబ‌రు ఎండ్ లోనే నాలుగైదు ఆఫ‌ర్లు శ్రీ లీల వెంట క్యూ క‌డ‌తాయ‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 

అయితే అన్ని సార్లు అనుకున్న‌ట్లే జ‌ర‌గ‌వు. హిట్, యావ‌రేజ్‌లు మాత్ర‌మే కెరీర్‌ను ఆదుకుని, ముందుకు తీసుకుని వెళ్ల‌లేవు. ఏదో ల‌క్ ఉండి ఒక‌టి రెండు సినిమాలు ఆడి, త‌ర్వాత స్టోరీ సెలెక్ష‌న్స్‌లో వీక్ అయితే మాత్రం కెరియ‌ర్ త‌ప్పుదోవ ప‌ట్ట‌డం ఖాయం. కాబ‌ట్టి ఈ టైమ్‌లో శ్రీలీల జాగ్ర‌త్త వ‌హించ‌డం చాలా అవ‌స‌రం. ఒక మంచి సూప‌ర్ హిట్ త‌న కెరియ‌ర్ గ్రాఫ్ ని, రెమ్యూన‌రేష‌న్ రేంజ్‌ను పెంచుతుంద‌న‌డంలో డౌటే లేదు. 

ప్ర‌స్తుతం శ్రీలీల బోయ‌పాటి- రామ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమాతో పాటు, అనిల్ రావిపూడి బాల‌య్య కాంబోలో తెర‌కెక్కుతున్న సినిమా కూడా చేస్తుంది. వీటితో పాటు అన‌గ‌న‌గా ఒక రోజు, జూనియ‌ర్ అనే మ‌రో రెండు తెలుగు సినిమాలు చేస్తున్న శ్రీలీల, కిస్ అనే క‌న్న‌డ సినిమాతో తెరంగేట్రం చేసిన విష‌యం తెలిసిందే.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :