ASBL NSL Infratech

వామ్మో! ఒకే బ్యాన‌ర్‌లో 30 సినిమాలా

వామ్మో! ఒకే బ్యాన‌ర్‌లో 30 సినిమాలా

ఒక ప్రొడ‌క్ష‌న్ హౌస్ 30 సినిమాలు పూర్తి చేస్తేనే ఆశ్చ‌ర్యపోతున్న రోజుల్లో, 30 సినిమాలు ఒకే సంస్థ నుంచి ప్లానింగ్ లో ఉన్నాయంటే ఆశ్చ‌ర్యం వేయ‌క మానదు. మొద‌ట్లో ఏదో క‌సిగా సినిమాలు తీసి, ఆ త‌ర్వాత క‌నుమ‌రుగవుతున్న ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లు చాలానే క‌నిపిస్తాయి. సినిమా నిర్మాణ‌మ‌నేది జూదంలా మారిపోయిన ఈ రోజుల్లో నిల‌క‌డ‌గా స‌క్సెస్‌లు అందుకుని, దీర్ఘ‌కాలం నిలిచే సంస్థ‌లు చాలా త‌గ్గిపోతున్నాయి. 

కాంబినేష‌న‌ల్ మీద ఆధార‌ప‌డి సినిమాలు తెర‌కెక్కుతున్న ఈ రోజుల్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్లో దాదాపు 30 సినిమాల వ‌ర‌కు ప్లానింగ్‌లో ఉన్న‌ట్లు ఫిల్మ్ న‌గ‌ర్‌లో వార్త‌లొస్తున్నాయి. మొద‌ట్లో కాస్త నెమ్మ‌దిగా అడుగులేసిన ఈ బ్యాన‌ర్, చిన్న సినిమాల‌ను మాత్ర‌మే నిర్మించింది. వాటి ఫ‌లితాలు కూడా ఆ రేంజ్లోనే వ‌చ్చాయి. 
 
కానీ పోయిన సంవ‌త్స‌రం కార్తికేయ‌2తో పాన్ ఇండియ‌న్ హిట్ అందుకున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ‌కు, కొన్ని నెల‌ల‌కే ధ‌మాకా రూపంలో మ‌రో హిట్ త‌గిలింది. దీంతో ఈ బ్యాన‌ర్ దూకుడు పెంచింది. ఇప్పుడు ఇద్ద‌రు టాప్ హీరోల‌తో సినిమాలు చేస్తూ, త‌మ బ్యాన‌ర్ ను త‌ర్వాతి స్థాయికి తీసుకెళ్లే ప‌నిలో బిజీగా ఉంది. 

మారుతి-ప్ర‌భాస్ సినిమాతో పాటూ, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న వినోదాయ సీతం రీమేక్ ను నిర్మిస్తుంది కూడా ఈ బ్యాన‌రే. రానున్న మే మొద‌టి వారంలో రిలీజ్ కానున్న రామ‌బాణం ఈ బ్యాన‌ర్ నుంచి వ‌స్తున్న సినిమానే. ఇవి కాకుండా అనౌన్స్ చేయ‌కుండానే సైలెంట్ గా సెట్స్‌పైకి వెళ్లిన‌వి కొన్నైతే, ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుపుకుంటున్న‌వి మ‌రికొన్ని, క‌థా చ‌ర్చ‌ల్లో ఉన్న‌వి ఇంకొన్ని. ఇలా ఈ బ్యాన‌ర్లో లైన్‌లో చాలానే సినిమాలున్నాయ‌ట‌. ఒకే టైమ్ లో ఒక బ్యాన‌ర్ నుంచి ఇన్ని సినిమాలంటే రికార్డ‌నే చెప్పాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :