NRI : ఎన్ఆర్ఐలు బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలి : సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు తాను కూడా కొన్ని బంగారు కుటుంబాలను దత్త తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu ) వెల్లడిరచారు. సచివాలయంలో జీరో పావర్టీ-పీ4 (Zero Poverty-P4) పై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పేదరికంపై చేస్తున్న పోరులో తనతో పాటు తన కుటుంబసభ్యులు కూడా భాగస్వాములు అవుతారని తెలిపారు. పీ4 కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగుతోంది. పేద కుటుంబాల సాధికారతే కూటమి ప్రభుత్వం లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారందరినీ ఈ కార్యక్రమంలో మమేకం చేయాలి. కార్పొరేట్ సంస్థలు(Corporate organizations) కలిసి వచ్చేలా చూడటంతో పాటు సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత జిల్లాల కలెక్టర్లదే (District Collectors) . గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ఆ ప్రాంతానికే చెందిన ఎన్ఆర్ఐ (NRI ) లు, పారిశ్రామికవేత్తలు, స్థానిక బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలి. బంగారు కుటుంబాల అత్యంత ప్రాధాన్యతలపై చేపట్టిన సర్వేను ఆగస్టు 10 లోపు పూర్తి చేయాలి. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలి అని ఆదేశించారు.







