Kajal Aggarwal: రెడ్ ఫ్రాకులో కాజల్ గ్లామర్ షో
సెలబ్రిటీలు ఈ మధ్య బీచ్ వెకేషన్లకు వెళ్లి అక్కడి నుంచి ఫోటోలను షేర్ చేసి సోషల్ మీడియా మొత్తాన్ని వేడెక్కిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) కూడా బీచ్ సెలబ్రేషన్స్ ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. ప్రస్తుతం తన భర్త గౌతమ్(Goutham) తో కలిసి ఆస్ట్రేలియాతో విహరిస్తున్న కాజల్ రెడ్ కలర్ డిజైనర్ ఫ్రాకులో బీచ్ లో అందంగా ఫోటోలకు పోజులిచ్చింది. ఈ థై స్లిట్ ఫ్రాక్ లో కాజల్ మరింత అందంగా కనిపిస్తుందని ఆమె ఫాలోవర్లు, నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.







