AP Liquor Scam: లిక్కర్ స్కాం కేసు నేపథ్యంలో వైసీపీ విజయసాయిరెడ్డిని మిస్ అవుతున్నారా?

వైసీపీ (YCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan ) ప్రస్తుత రాజకీయ పరిస్థితుల విద్య అసలు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఆయన ఎక్కువగా బెంగళూరు (Bengaluru)లో ఉన్న తన నివాసంలోనే గడుపుతున్నారు. సాధారణంగా వారంలో నాలుగు రోజులు తాడేపల్లి (Tadepalli)కి వచ్చి, పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ ఉండేవారు. కానీ ఈ వారం పూర్తిగా తాడేపల్లికి రాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇదే సమయంలో ఆయన బెంగళూరులో ఉండి కొన్ని కీలక విషయాలపై తన సన్నిహిత నేతలతో తీవ్ర చర్చలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మద్యం కుంభకోణం (Liquor Scam) విషయమే దానికి కేంద్రబిందువుగా మారినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఆ కుంభకోణం ప్రారంభంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినాయకత్వం పెద్దగా స్పందించలేదు. కానీ ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దర్యాప్తు ముమ్మరం చేయడంతో దాని ప్రభావం పార్టీపై పడతుందనే ఆందోళన మొదలైందని తెలుస్తోంది.
ఈ కేసు లోతుగా వెళ్తే పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లుతుందో అనే అంశం కూడా ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకత్వంలో చర్చకు వస్తోందని అంటున్నారు. జగన్ ఈ వ్యవహారంపై చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ, భవిష్యత్ పరిణామాలపై ముందస్తు చర్చలు జరుపుతున్నారని సమాచారం. అంతేకాదు, ఒకవేళ ఈ కేసు పెద్ద మలుపు తిప్పితే, జగన్ అరెస్టు అయ్యే పరిస్థితి వస్తే, ప్రజల నుంచి ఎంత మేరకు సానుభూతి వస్తుంది అనే అంశం కూడా పార్టీలో భిన్నాభిప్రాయాలకు దారితీస్తోంది.
ఇక మరోవైపు, ఈ కేసును బహిరంగంగా ప్రజల్లో చర్చనీయాంశం చేసేలా కూటమి పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయని అంటున్నారు.
ఈ నేపథ్యంలో, గతంలో పార్టీకి ఢిల్లీలో లాబీయింగ్ చేయగలిగిన విజయసాయిరెడ్డి (Vijayasai Reddy)లాంటివారిపై నాయకుల మద్దతు లేదు.
అప్పట్లో ఆయన పార్టీ పరంగా చాలా వ్యవహారాల్లో నడిపించిన తీరు, ముఖ్యనేతల మీద ప్రభావం చూపకుండా చూసిన తీరు ఇప్పటి పరిస్థితుల్లో గుర్తుకు వస్తోందని పలువురు చెబుతున్నారు. ప్రస్తుతం పార్లమెంటరీ పార్టీ నేతగా వైవీ సుబ్బారెడ్డి (Y.V. Subba Reddy) ఉన్నా, ఆయనకు ఢిల్లీ స్థాయిలో మద్దతు తీసుకురావడం లో నైపుణ్యం కొరతగానే ఉందని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా జగన్ సారథ్యంలో ఉన్న పార్టీకి ఇప్పుడు అన్ని వైపులా ఒత్తిడి పెరుగుతున్న వేళ, వ్యూహాత్మకంగా ఆలోచించే నేతల అవసరం మరింతగా కనిపిస్తోందని చెప్పుకోవాలి.