ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

మెంఫీస్ లో ఘనంగా ఉగాది వేడుకలు

మెంఫీస్ లో ఘనంగా ఉగాది వేడుకలు

మెంఫీస్‌ తెలుగు సమితి వారి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. అలాగే ముప్ఫై ఐదు సంవత్సరాల వసంతోత్సవాన్ని కూడా అక్కడి తెలుగువాళ్లు వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమం తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ మెంఫిిస్‌ అధ్యక్షుడు యెదురు పుల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో  ఘనంగా జరిగింది. ఈ నెల 4,5 తేదీల్లో జరిగిన ఈ సంబరాలకు స్థానిక వైట్‌ స్టేషన్‌ హై స్కూల్‌ ఆడిటోరియం వేదికగా నిలిచింది. శాస్త్రీయ సంగీతం, సాంప్రదాయ కూచిపూడి నృత్యాలు, నాడు -నేడు సినిమా పాటల్లో నృత్యాలు, బాహుబలి సినిమాలోని దృశ్యానుకరణలు అందరిని అలరించారు.

ఈ కార్యక్రమానికి మెంఫిస్‌ మేయర్‌ కార్యాలయం నుంచి కేఎన్‌ మూడి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వారితో ఈ సంబరాలలో పాలు పంచుకోవడం ఎంతో ఆనందం వుందన్నారు. అలాగే 35 వసంతాల పండుగలో పలువురు టాలీవుడ్‌ నటీనటులు, గాయనీ గాయకులు ప్రదర్శనలు అందర్ని అలరించాయి. అంతేకాకుండా తెలుగు వారి పసందైన వంటకాల విందు భోజనం, తాంబూలం(కిళ్లి)తో ఉగాది వేడుకలకు ముగింపు పలికారు.

ఈ సందర్భంగా మెంఫిస్‌ తెలుగు సమితి బోర్డు చైర్మన్‌ భద్రం నరిసెట్టి... టీఏఎం (తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ మెంఫిస్‌) చేస్తున్న వివిధ కార్యాక్రమాలను వివరించారు. అలాగే క్యాన్సర్‌ తో బాధపడుతున్న మన్నన్‌ పటేల్‌ (2) వసతి కోసం సేకరించిన 5000 డాలర్ల విరాళాన్ని బాలుని తండ్రికి అందజేశారు.

ఇక కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి కృషి చేసిన ఉపాధ్యక్షుడు గోపి జవాబ్‌ నవీస్‌, సహా ఉపాధ్యక్షుడు రంజిత్‌ కొమరవెళ్లి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ మండలపు, సహ ప్రధాన కార్యదర్శి మదన్‌ వెన్‌, కోశాధికారి సుబ్బారెడ్డి కర్నాటి. సహా కోశాధికారి రమేష్‌ నర్సాపురం, సాంస్కృతిక కార్యదర్శి రత్నాకర్రావు వాన, సాంస్కృతిక సహా కార్యదర్శి స్వప్ప వాంటరి, క్రీడల విభాగ కార్యదర్శి శ్రీనివాస్‌ బుసిరెడ్డి, క్రీడల విభాగ సహా కార్యదర్శి అరవింద్‌ నూనె, పుడ్‌ కమిటీ చైర్‌ పర్సన్చ్‌ంద్రశేఖర్‌ పొట్నూరు,  క్రియేటివ్‌ డైరెక్టర్‌ సత్య ప్రోద్దుటూరి, యూత్‌ కమిటీ చైర్‌ పర్సన్‌  రవిపోలూరి, మార్కెటింగ్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ రాజేంద్ర తంగళ్లపల్లి, మార్కెటింగ్‌ కమిటీ ఉప చైర్‌ పర్సన్‌ అరుణ్‌ ద్వసాని, మీడియా చైర్‌ పర్సన్‌ సింధూర కల్లేపల్లి మరియు బోర్డు చైర్మన్‌ వీరభద్రం నరిశెట్టి, ధర్మకర్తలు స్వామి పాలస, ఉదయ్‌ నట్రలను, రాజ్‌ తోట మరియు సురేశ్‌ కొత్తలను అభినందించారు.

 

Tags :