ASBL NSL Infratech

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వైసీపీ ఆపసోపాలు..!

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వైసీపీ ఆపసోపాలు..!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ యాక్ట్ ను జగన్ ప్రభుత్వం ఆమోదించింది. దీని ద్వారా జగన్ ప్రభుత్వం పేదల స్థలాలను కొట్టేసేందుకు ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ చట్టం ద్వారా ఎంతో మేలు జరుగుతుందని వైసీపీ వివరిస్తోంది. భూసమగ్ర సర్వే ఈ చట్టంలో ఒక భాగం. అదే జరిగితే భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి.. అవి ఎవరి పేరిట ఉన్నాయి.. లాంటి వివరాలన్నీ బహిర్గతమవుతాయి. వాటిని కబ్జా చేసేందుకు వైసీపీ నేతలు ఈ చట్టం తీసుకొచ్చారనే అంశాన్ని విపక్షాలు ప్రధానంగా ఎత్తి చూపుతున్నాయి.

దేశంలో ఇప్పటికీ భూములకు సంబంధించి బ్రిటీష్ చట్టాలే అమల్లో ఉన్నాయి. ఇప్పటకీ దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన సర్వే నెంబర్ల ఆధారంగానే క్రయవిక్రయాలు జరుగుతున్నాయి భూములు కొన్నా, అమ్మినా రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వెళ్లి బదిలీ చేయించుకుంటున్నారు. అయితే కొంతమంది నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూములు తమవేనని క్లెయిమ్ చేసుకుంటున్నారు. దీనివల్ల చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి వాటికి స్వస్తి చెప్పేలా వాళ్ల భూములపై సర్వహక్కులూ వాళ్లకే చెందేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దోహదం చేస్తుందని జగన్ ప్రభుత్వం చెప్తోంది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించే వీలుండదని క్లారిటీ ఇచ్చింది.

అయితే వైసీపీ నేతలు భూములను కబ్జా చేసేందుకే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తెరపైకి తెచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. భూములను సమగ్ర సర్వే చేస్తే ఎక్కడెక్కడ ఖాళీ భూములున్నాయి.. వివాదాస్పద భూములు ఎక్కడున్నాయి.. లాంటి సమచారమంతా వైసీపీ నేతలు చేతుల్లోకి వెళ్తుందని.. అలాంటి వాటిని కబ్జా చేసేందుకు ఈ ఎత్తుగడ వేసిందని దుయ్యబడుతున్నాయి. అంతేకాక.. ఈ చట్టం అమలు చేయడం ద్వారా మనకు జిరాక్స్ పేపర్ తప్పా ఏమీ ఉండదని.. రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా మనకు ఇవ్వరని విమర్శిస్తున్నాయి. ఈ అంశాలు భూయజమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తేనే తాము అమలు చేశామని వైసీపీ చెప్తోంది. ఇప్పుడు చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి అసలు దోషులు వాళ్లేనని రివర్స్ ఎటాక్ చేస్తోంది. అయితే చంద్రబాబు మాత్రం తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. అంతేకాదు.. కేంద్రం ప్రతిపాదిస్తే దేశంలో ఏ రాష్ట్రమూ అమలు చేయట్లేదని.. ఒక్క వైసీపీ ప్రభుత్వం మాత్రమే అమలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. దీని నుంచి బయటపడేందుకు వైసీపీ ఆపసోపాలు పడుతున్నట్టు అర్థమవుతోంది.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :