ASBL NSL Infratech

డల్లాస్ లో అంగరంగ వైభవంగా టీపాడ్ బతుకమ్మ-దసరా వేడుకలు

డల్లాస్ లో అంగరంగ వైభవంగా టీపాడ్ బతుకమ్మ-దసరా వేడుకలు

కళల నిలయమైన అమెరికాలోని డాలస్.. మన తెలుగువారి పండుగల అందాలనూ అద్దుకుంటున్నది. తంగేడు వనాన్ని, గునుగుపూల సోయగాన్ని ఇముడ్చుకుని తెలంగాణ పండుగ బతుకమ్మకు మరింత కళను జోడించింది. చరిత్ర సంరక్షణకూ పెట్టింది పేరైన ఆ పట్టణం.. మన బతుకమ్మ, దసరా పండుగల సంప్రదాయాన్నీ కొనసాగిస్తున్నది, అక్కడ నివసిస్తున్న తెలంగాణ ప్రజల సమూహం తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్).. ఏ విదేశంలోనూ నిర్వహించలేనంత గొప్పగా వైభవంగా, ఈ పండుగలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి డాలస్ లో ప్రత్యేకతను చాటింది. దాదాపు పదిహేను వేల మంది హాజరై మహా సందడి చేసిన ఈ కార్యక్రమానికి డాలస్ పరిధిలోని ఫ్రిస్కో పట్టణంలో గల కొమెరికా సెంటర్ (డాక్టర్ పెప్పర్ ఎరెనా) వేదికగా నిలిచింది. తెలంగాణ పల్లెతనమంతా ఇక్కడే కొలువుదీరిందా అనేలా డాలతో పాటు సమీప పట్టణాల్లో నివసించే తెల గువారందరూ ఈ కార్యక్రమానికి సంభ్రమాశ్చర్యాలతో విచ్చేశారు. ఏటా బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి దృష్టిని ఆకర్షించిన టీపాడ్ ఆతిథ్యం గురించి తెలుసుకుని పొరుగు రాష్ట్రాలైన ఓక్లహామా, కాన్సాస్, ఆర్కన్సాస్లో ఉంటున్న తెలుగువారూ ఇక్కడికి విచ్చేసి సందడి చేశారు. 

అతి పెద్ద ఎవెర్న్ తో సెంటర్ అయిన కొమెరికా సెంటర్ ముందు వేల కొలది బారులు తీరి నిలబడ్డారని స్థానికులు మరియి టీపాడ్ నిర్వాహకులు తెలిపారు. ఆడపడుచుల పలకరింపులు, పట్టుచీరల సోయగాలు, మెడనిండా మెరిసిన నగల సొబగులు కార్యక్రమ వేదికైన కొమెరికా సెంటర్‌కు కొత్త శోభనిచ్చాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని ఐదారువేల మంది మహిళలు, బాలికలు సామూహికంగా పాడుతూ, చప్పట్లు కొడుతూ లయబద్దంగా కదులుతుంటే స్టేడియం దద్దరిల్లిపోయింది. వారిని అనుసరిస్తూ కుటుంబసభ్యులు కూడా చప్పట్లు కొడుతూ 

అందరిలో జోష్ నింపారు. కళాత్మకంగా మార్మోగుతున్న శబ్దాలు, పాటలతో ఆహుతుల మనసు పులకించిపోయింది. అక్కడి కాలమాన ప్రకారం అక్టోబర్ 1 మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక డ్యాన్స్ స్కూల్స్ విద్యార్థుల నృత్యాలతో వేడుక మొదలయింది. అమ్మవార్లే కదిలివచ్చారా అన్నట్టుగా నవదుర్గ వేషధారణతో అమ్మాయిల ఊరేగింపు వైభవోపేతంగా సాగింది. నాలుగు గంటల పాటు సాగిన సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం బతుకమ్మ వేడుకలు మొదలయ్యాయి. సినీనటి రీతూవర్మ సందడి చేశారు. అనంతరం విజయదశమి వేడుకలను నిర్వహించారు. శమీపూజ చేశారు. అలయ్ బలయ్ తీసుకుని సొంతగడ్డపై పండుగ చేసుకున్న ఆనందాన్ని పంచుకున్నారు. 

ఆపై అందరినీ ఆహ్లాదపరుస్తూ సంగీత దర్శకుడు అనూహ్రూబెన్స్ బృందం తమ పాటలు, సంగీతంతో కొత్త లోకంలో విహరించేలా చేసింది. గాయకులు లిప్సికా, రోల్ లైడా, ధనుంజయ్ తదితరులు తమ పాటలతో ఉర్రూతలూగించారు. రాత్రి 12 గంటల వరకు సాగిన ఈ కార్యక్రమం అక్కడి తెల గువారి మనసునిండా కొత్త అనుభూతిని నింపింది. కాగా, ఈ కార్యక్రమ నిర్వహణకు గాను తెలంగాణ పీపుల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్) భారీ కసరత్తే చేసింది. దాదాపు నెలరోజుల క్రితమే అసోసియేషన్ బృందం కమిటీ లు గా ఏర్పడి బాధ్యతలను తీసుకున్నారు. 

టీపాడ్ ఫౌండేషన్ కమిటీ చైర్ అజయ్ రెడ్డి, రఘువీర్ బండారు, జానకి రామ్ మందాడి, రావుకల్వల, అధ్యక్షుడు రమణ లష్కర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్ ఇంద్రాణి పంచెర్పుల, కోఆర్డినేటర్ పాండు పాల్వాయి, పవన్ గంగాధర, మాధవి సుంకిరెడ్డి, అశోక్ కొండాల, రామ్ అన్నాడీ, గోలి బూచి రెడ్డి, సుధాకర్ కలసాని, ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ రవికాంత్  రెడ్డి మామిడి, లక్ష్మి పోరెడ్డి, మాధవి లోకిరెడ్డి, రత్న ఉప్పల, శ్రీనివాస్ అన్నమనేని, శ్రీధర్ వేముల, మధుమతి వైశ్యరాజు, అనురాధ మేకల, మంజుల తొడుపునూరి, లింగ రెడ్డి ఆళ్వా, స్వప్న తుమ్మపాల, రేణుక చనుమోలు, గాయత్రి గిరి, శంకర్ పరిమల్, అడ్విసోర్స్ వేణు భాగ్యనగర్, నరేష్ సుంకిరెడ్డి, కరణ్ పోరెడ్డి, రూప కన్నయ్యగారి, రోజా ఆడెపు, సతీష్ నాగిళ్ల, చంద్ర పోలీస్, శ్రీనివాస్ వేముల కార్యక్రమం ఆసాంతం విజయవంతమయ్యేలా, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. 

కాలిఫోర్నియాలో నివాసముండే హెల్త్ కేర్ మొఘల్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి.. ముందుగా ప్రకటించినట్టే తన మద్దతు ప్రకటించారు. నాటా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి కొర్సపాటి తనవంతు సహాయ సహకారాలు అందించారు. అనేక మంది స్థానిక నాయకులు, వ్యాపారులు వేడుకల నిర్వహణలో భాగస్వాములయ్యారు. 

ఈ సందర్భంగా, స్థానిక మరియు జాతీయ తెలుగు సంస్థలకు, దాతలకు, మీడియా సంస్థలకు మరియు తమ కార్యక్రమాలకు విచ్చేసి ఘానా విజయ, అందిస్తున్న డాలస్ లోని తెలుగు వారందరికీ టీపాడ్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

  

Click here for Event Gallery

 

Tags :