ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కొలంబస్‌లో నిరంజన్‌ శృంగవరపు ప్రచారం

కొలంబస్‌లో నిరంజన్‌ శృంగవరపు ప్రచారం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రస్తుత ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి పోటీ పడుతున్న నిరంజన్‌ శృంగవరపు కొలంబస్‌లో ప్రచారపర్యటన చేశారు. ఈ సందర్భంగా తానా సభ్యులను కలుసుకుని తనను, తన టీమ్‌ ను గెలిపించాల్సిందిగా కోరారు. పనిచేసేవాళ్ళనే గెలిపించి తానాలో కొత్త మార్పును తీసుకువచ్చేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు. తమ టీమ్‌ లో ఉన్నవారంతా తానాకోసం నిరంతరం శ్రమించేవారని, కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాలుపంచుతున్నవారేనని చెప్పారు. 

తమ టీంలో యువతరానికి పెద్దపీట వేశామని శశాంక్‌, అశోక్‌, శిరీష లాంటి యువతరాన్ని పోటీల్లో నిలబెట్టామని చెప్పారు. తదుపరి అధ్యక్షుడు అంజయ్య చౌదరి మాట్లాడుతూ తానా ప్రచారయాత్ర ఒహాయో నుండి ప్రారంభించడం ఆనవాయితీ అని దానిలో భాగంగా కొలంబస్‌ ప్రజలతో మమేకం అయి వారికి తమ గళాన్ని వినిపించే అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి హాజరయిన ప్రవాసులు నిరంజన్‌ ప్యానెల్‌ ప్రణాళికకు సంఘీభావాన్ని తెలిపారని ఆయన ప్యానెల్‌ సభ్యులు వెల్లడించారు. కార్యక్రమంలో  టీం అభ్యర్థులు పురుషోత్తమ చౌదరి, ఉమ కటికి, రాజా కసుకుర్తి, సతీష్‌ వేమూరి, సుమంత్‌ రామిశెట్టి, వడ్లమూడి రవిచంద్ర(నాని)తో పాటు పలువురు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. సామినేని రవి, యలవర్తి శ్రీని, కాట్రగడ్డ క ష్ణ, నెక్కంటి చౌదరి, చావా శివ తదితరులు ఈ సదస్సు విజయవంతానికి కృషి చేశారు.

క్లీవ్‌ల్యాండ్‌లో...

ఒహాయో రాష్ట్రం క్లీవ్‌ల్యాండ్‌లో కూడా నిరంజన్‌ టీమ్‌ పర్యటించింది. కోవిద్‌ నిబంధనలకు అనుగుణంగా సాగిన ఈ కార్యక్రమంలో నిరంజన్‌ మాట్లాడుతూ మార్పు కోసం యువతకు పెద్దపీట వేసిన ప్యానెల్‌ తమదేనని, అమెరికన్‌ యువతను తానాకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నామని అన్నారు. తానాలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి నిలబెట్టేందుకు తమ ప్యానెల్‌ కట్టుబడి ఉంటుందని, తమ ప్యానెల్‌ను గెలిపించి దీనికి మద్దతు పలకాల్సిందిగా క్లీవ్‌ల్యాండ్‌ తానా సభ్యులను కోరారు. కొమ్మినేని శరత్‌, వడ్లమూడి రవిచంద్ర(నాని), పంగులూరి రామారావు, షేక్‌ సలీమ్‌, చెట్టిభక్తుని దుర్గాప్రసాద్‌, బొడ్డు నరేష్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నిరంజన్‌ ప్యానెల్‌ నుండి తానా కార్యదర్శిగా గెలుపొందిన వేమూరి సతీష్‌, కొల్లా అశోక్‌బాబు, తూనుగుంట్ల శిరీష, రాజా కసుకుర్తి, ఓరుగంటి శ్రీనివాస్‌, సుమంత్‌ రామిశెట్టి, శ్రీ చౌదరి, గుదే పురుషోత్తమ చౌదరి తదితరులు హాజరయ్యారు.

Click here for Photogallery

 

Tags :