ASBL NSL Infratech

కర్నూలు జిల్లా గోరంట్లలో వైయస్ జగన్ ప్రసంగం..

కర్నూలు జిల్లా గోరంట్లలో వైయస్ జగన్ ప్రసంగం..

ఈ రోజు మనమంతా కూడా ఇక్కడ బీసీ సోదరులందరితో.. ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నాము. నాలుగు సంవత్సరాల టీడీపీ పరిపాలన చూసిన తర్వాత.. మనకు ఎటువంటి నాయకుడు కావాలని ప్రశ్న వస్తోంది. బాబు నాలుగేళ్ల పరిపాలనలో ఎన్నికల ముందు బాబు ఏమన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత తాను చెప్పిన మాటలు అన్నీ కూడా నెరవేర్చారా లేదా అన్నది ప్రశ్నించుకోవాలి. ఎన్నికలప్పుడు మైక్ పట్టుకొని మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయటం ధర్మమేనా అని శ్రీ జగన్ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా టీడీపీ మేనిఫెస్టోను శ్రీ జగన్ చూపిస్తూ.. ఇందులో ప్రతి మాటా.. ప్రతి స్పీచ్ లో బాబు చెప్పుకుంటూ పోయారన్నారు. ఇందులో కొన్ని మాటలు చదువుతాను. కొన్ని కులాలకు బాబు ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా శ్రీ జగన్ చదివి వినిపించారు. కురుమ సోదరులను ఎస్టీలుగా చేరుస్తామని చర్యలు తీసుకుంటానని చంద్రబాబు చెప్పారు. వాల్మీలకు, బోయలకు సంబంధించి కూడా హామీలు ఇచ్చారన్నారు. వాల్మీకి సోదరులకు ఏపీలో అన్ని ప్రాంతాల్లో ఎస్టీలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రజకులను కూడా ఎస్సీలుగా చేసేందుకు చర్యలు తీసుకుంటామని బాబు హామీలు ఇచ్చిన సంగతి ఈ సందర్భంగా శ్రీ జగన్ గుర్తు చేశారు. ఎన్నికలప్పుడు ప్రతి కులాన్ని చంద్రబాబు మోసం చేశారన్నారు. రజక, బోయ సోదరుల్ని ప్రశ్నిస్తున్నా.. ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి మోసం చేయటం ధర్మమేనా అని శ్రీ జగన్ అడిగారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు ఏమేమి చెప్పారో.. ఓసారి గుర్తుచేసుకోండన్నారు. కరెంటు బిల్లులు భారీగా పెరిగాయి. అవన్నీ తగ్గిస్తామని బాబు హామీ ఇచ్చారన్నారు. కానీ బాబు ముఖ్యమంత్రి అయ్యాక.. కరెంటు బిల్లులు రూ.500 నుంచి వెయ్యి వస్తోందన్నారు. కరెంటు బిల్లులు తగ్గిస్తానన్న పెద్దమనిషి.. ఏకంగా భారీగా వడ్డింపులు చేశారన్నారు. ఐదేళ్ల క్రితం రేషన్ షాపుకు వెళ్తే.. చింతపండు, చక్కెర, పామాయిల్, కందిపప్పు, కిరోసిన్ గాక 9 రకాల వస్తువులు లభించేవి అన్నారు. ఇప్పుడు బాబు ముఖ్యమంత్రి అయ్యాక బియ్యం తప్ప ఇంకేమీ ఇవ్వటం లేదన్నారు. ఆ బియ్యం కూడా ఇంట్లో నలుగురు ఉంట్లో ఇద్దరికి వేలిముద్రలు పడటం లేదని ఎగరగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు ప్రతిపేదవాడికి మూడు సెంట్ల స్థలం, ఇళ్లు కట్టిస్తానని చెప్పారన్నారు. నాలుగు సంవత్సరాల చంద్రబాబు పరిపాలన తర్వాత ప్రశ్నిస్తున్నా.. కనీసం ఒక్క ఇళ్లైనా కట్టించారా అని శ్రీ జగన్ నిలదీశారు. ఎన్నికల ముందు.. జాబు రావాలంటే.. బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే ఇంటింటికీ రెండు వేలు ఇస్తామన్నారు. మరి, ఇచ్చారా అని బీసీలను శ్రీ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబులా .. బీసీలకు ఇస్త్రీపెట్టెలు, కత్తెరలు ఇవ్వమన్నారు. బీసీ సోదరులందరికీ తోడుగా ఉంటానని శ్రీ జగన్ భరోసా ఇచ్చారు. కుటుంబాలు బాగుపడాలంటే పిల్లలు చదవాలి. ఏపీ జనాభాలో 32% చదువు రాని పరిస్థితిలో ఉందన్నారు. కాలేజీ ఫీజులే కాదు.. వారి మెస్ ఛార్జీలు చెల్లిస్తామన్నారు. ప్రతి తల్లి పిల్లల్ని బడులకు పంపితే వారి జీవితాలు మారిపోతాయన్నారు. పిల్లల్ని బడులకు పంపితే సంవత్సరానికి రూ.15వేలు ఇస్తామన్నారు. దీనివల్ల ఆ పిల్లలు బడులకు వెళ్తారు. ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటకు వస్తారని శ్రీ జగన్ తెలిపారు. మీరు ఏ స్కూల్ కు పంపినా.. ఫర్వాలేదు.. ప్రతి తల్లికీ రూ15వేలు ఇస్తామని శ్రీ జగన్ స్పష్టం చేశారు. బడుల నుంచి కాలేజీ స్థాయికి వస్తారు. ఇంజనీరింగ్, డాక్టర్ చదివించే తల్లిదండ్రులు ఎవ్వరూ భయపడవద్దని.. లక్ష ఆపైన ఉండనీ.. ఆ ఫీజులన్నీ భరిస్తామని హామీ ఇచ్చారు. ఇంజనీరింగ్ చదవటానికి దూరప్రాంతాలకు వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయి.. అలా పంపించే పరిస్థితిలో చాలా మంది ఉన్నారన్నారు. ఆ పిల్లలు ఉండటానికి, తినటానికి రూ20వేలు ఇస్తామన్నారు. చదువల విప్లవం దివంగత మహానేత వైయస్ఆర్ గుర్తుకు వచ్చేలా చేస్తామన్నారు.

ధర్మవరంలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే వెళ్లానని వారిని ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోలేదన్నారు. తను అక్కడకి వెళ్లినప్పుడు ఆడవాళ్లు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారని శ్రీ జగన్ తెలిపారు. పనులకు వెళ్తే తప్ప కడుపు నిండని పరిస్థితిలో ఉన్నారన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ రూ.2వేలు చేయటమే కాకుండా.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వయస్సు 45 ఏళ్లకు తగ్గిస్తామన్నారు.దీనివల్ల చాలా మంది పేదవాళ్లకు మేలు జరుగుతుందన్నారు. ఇవిగాక, 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదన్నారు. నాలుగేళ్ల బాబు పాలన చూశారని.. ఒక్క ఇళ్లు కట్టించలేదన్నారు. మళ్లీ నాన్నగారి సువర్ణయుగాన్ని తెస్తామన్నారు. ఇలా గ్రామాలకు వెళ్లి.. ఇళ్లు లేవా అని అడిగితే.. ఒక్క చెయ్యి పైకి లేవదన్నారు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు చెప్పండి. ఎన్నికల నాటికి ఎంతైతే అప్పు ఉంటే.. అంత మొత్తాన్ని నాలుగు దఫాల్లో మీ చేతికే ఇస్తామని శ్రీ జగన్ హామీ ఇచ్చారు. ఇవాళ రైతన్నలకు సున్నా వడ్డీకి, పావలా వడ్డీకి రుణాలు ఎందుకు రావటం లేదో ఆలోచించారా అని శ్రీ జగన్ ప్రశ్నించారు. బ్యాంకులకు వడ్డీ డబ్బులు ఇస్తే.. వారు ప్రజలకు వడ్డీలేని రుణాలు ఇస్తారన్నారు. చంద్రబాబు బ్యాంకులకు డబ్బులు కట్టడం మానేశారని దీంతో బ్యాంకులు ఇవ్వటం లేదన్నారు. మేం అధికారంలోకి వచ్చేనాటికి ఎంత అప్పు ఉంటుందో అంత మీ చేతికి నాలుగు విడతల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 

కురుము సోదరులు వచ్చి గొర్రెలు చనిపోతే ఇన్ స్యూరెన్స్ ఇవ్వటం లేదని, గొర్రెల చెవులకు పోగులు వేయటం లేదని .. మందులు దొరకటం లేదని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఈ  పరిస్థితి మారుస్తామన్నారు. పశువుల కోసం 102 కూడా తెస్తామన్నారు. ప్రతి పేదవాడినీ సంతోషంగా నిలబెట్టే కార్యక్రమం చేస్తామన్నారు. మీరు ఏదైనా సలహాలు ఇస్తే.. మన ఎన్నికల ప్రణాళికలో చేరుస్తామన్నారు. ఎన్నికల ప్రణాళిక కేవలం రెండు, మూడు పేజీలే ఉంటుందన్నారు. చెప్పినవే కాదు.. చెప్పనవీ చేసి చూపిస్తామన్నారు. ఈ ఎన్నికల ప్రణాళికలో చెప్పినవీ చేసి చూపించామని.. ప్రజలకు వివరిస్తామని శ్రీ జగన్ వివరించారు.

Click here for Photo Gallery

 

Tags :