ASBL Koncept Ambience
facebook whatsapp X

మోదీకి వ్యతిరేకంగా దేశంలో సునామీ రాబోతోంది: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

మోదీకి వ్యతిరేకంగా దేశంలో సునామీ రాబోతోంది: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా సునామీ రాబోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు దేశంలో మార్పు కోరుకుంటున్నారని, ఈసారి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ఆయనన్నారు. సోమవారం కొడంగల్‌లో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. తెలంగాణలో శాంతిభద్రతలను దెబ్బతీసి పెట్టుబడులు రాకుండా చేసి.. వాటిని గుజరాత్‌కు తరలించుకుపోవాలని బీజేపీ చూస్తోందని, ఇక్కడ కూడా యూపీ పరిస్థితిని తీసుకురావాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ‘‘దేశంలో ఎన్డీయే పత్తాలేకుండా పోతుంది. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. సౌత్ ఇండియాలో బీజేపీకి 15-20 సీట్లు కూడా రావు’’ అంటూ రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. అలాగే దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు కాంగ్రెస్‌కు, ఇండియా కూటమికి రెఫరెండం లాంటివని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

అనంతరం బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించిన తెలంగాణ సీఎం.. రాష్ట్ర రైతులకు రైతుబంధు ఎలా ఇచ్చామో, ఆగస్టు 15లోగా రుణమాఫీ కూడా అలాగే చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కేఏ పాల్ మాదిరిగా మాట్లాడుతున్నారని, మానసిక ఒత్తిడితో, నిరాశతో విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 39.5 శాతం ఓట్లు వచ్చాయని, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో అంతకుమించి ఓట్లు రాబోతున్నాయని జోస్యం చెప్పారు.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :