ASBL NSL Infratech

హ్యూస్టన్‌లో ఆటా మీట్‌ అండ్‌ గ్రీట్‌ సక్సెస్‌ 

హ్యూస్టన్‌లో ఆటా మీట్‌ అండ్‌ గ్రీట్‌ సక్సెస్‌ 

మనలో చాలా మందికి తెలుసు, 18వ ఆటా (అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌) కన్వెన్షన్‌ అండ్‌ యూత్‌ కాన్ఫరెన్స్‌ ఈ సంవత్సరం అట్లాంటాలో జూన్‌ 7 నుండి 9 వరకు మునుపెన్నడూ జరగని రీతిలో జరగబోతోందని. కొన్ని కార్యక్రమాలు ఇప్పటికే సమాంతరంగా జరుగుతున్నాయి, అనేక మంది వాలంటీర్లు పట్టుదలతో  పనిచేస్తున్నారు. మరింత అవగాహన కల్పించడానికి మరియు నిధుల సేకరణ కోసం అమెరికా అంతటా సమావేశాలు జరుగుతున్నాయి. 

హ్యూస్టన్‌ అమెరికాలోని అతిపెద్ద నగరాల్లో ఒకటి మరియు ఆటా కి ఎల్లప్పుడూ బలమైన మద్దతుదారుగా ఉంది. అలానే,  శ్రీధర్‌ కంచనకుంట్ల, జయప్రకాష్‌ ముదిరెడ్డి నేతృత్వంలో మంచి టీమ్‌ కూడా ఉంది. మార్చి 1న హ్యూస్టన్‌ లో కన్వెన్షన్‌ కిక్‌ ఆఫ్‌ మీటింగ్‌ జరిగింది. ఆ అందమైన సాయంత్రం 200 మందికి పైగా పురవాసులు పాల్గొని, స్థానిక మరియు జాతీయ నాయకుల నుండి కన్వెన్షన్‌  యొక్క వివిధ విషయాలు, వాటి వివరాలు తెలుసుకున్నారు. హాజరైనవారు కన్వెన్షన్‌ మీద అపారమైన ఆసక్తి కనబరిచారు. అలాగే, అన్ని విషయాలలో సహకరించడానికి మరియు పాల్గొనడానికి తమ సుముఖతను వ్యక్తం చేశారు.

ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, కన్వెన్షన్‌ కన్వీనర్‌ కిరణ్‌ పాశం మరియు పూర్వ అధ్యక్షులు శ్రీనివాస్‌ పిన్నపురెడ్డి, కరుణాకర్‌ ఆసిరెడ్డి హాజరై, బృందాన్ని ఉద్దేశించి ప్రసంగించడం, అందరితో కలివిడిగా ఉండటం చాలా ప్రేరణ మరియు స్ఫూర్తినిచ్చింది. శ్రీధర్‌ మరియు జయప్రకాష్‌ నాయకత్వం లో జగపతి రెడ్డి వీరాటి, బంగార్‌ రెడ్డి, దయాకర్‌ దవలాపూర్‌, వెంకట్‌ రెడ్డి గార్లపాటి, శ్రీనివాస్‌ పిన్నపురెడ్డి, దామోదర్‌ జమిల్లి, చందు మాదిరెడ్డి ఇంకా అనేక మంది సహకారంతో హ్యూస్టన్‌ టీమ్‌ ప్రారంభ లక్ష్యం కంటే ఎక్కువ విరాళాలు సేకరించటం అభినందనీయం. దాతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సభికులు లేవనెత్తిన అన్ని ప్రశ్నలు మరియు సందేహాలకు నాయకులు చక్కగా సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా చాలా మంది తమ స్నేహితులను కలుసుకుని పలకరించుకోవడం, కొత్త పరిచయాలు మరియు స్నేహాలు చేసుకోవడం కనిపించింది. అందరికీ భోజనం మరియు పానీయాలు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు, దాతలు, నాయకులు, వాలంటీర్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేసి, కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.

మరిన్ని కార్యక్రమాలు రాబోతున్నాయి. అనేక పోటీలు మరియు క్రీడల కోసం రిజిస్ట్రేషన్‌లు ఇప్పటికే మొదలయ్యాయి. మరిన్ని వివరాల కోసం www.ataconference.org  ని సందర్శించండి లేదా ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లో ఆటా ని అనుసరించండి. మేము ఎప్పటికప్పుడు సరికొత్త విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాము, చూస్తూనే ఉండండి.

 

Click here for Photogallery

 

 

Tags :