ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

విశ్వశాంతి కోసమే అయుత చండీయాగం

విశ్వశాంతి కోసమే అయుత చండీయాగం

శృంగేరి పీఠం నుంచి వచ్చిన ప్రధాన రుత్వికుల్లో ఒకరైన ఫణిశశాంక శర్మ అయుత చండీయాగం నేపథ్యాన్ని వివరించారు. నవ చండీ, శీత చండీ, సహస్ర చండీ యాగాలను చాలా మంది కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా చేస్తారని అన్నారు. అయుత చండీయాగం మాత్రం విశ్వశాంతి కోసం చేస్తారన్నారు. ఇది చాలా అరుదుగా చేస్తారన్నారు. ఐదు రోజుల  పాటు జరిగే ఈ కార్యక్రమంలో మొదటి నాలుగు రోజులు సప్తశతి చండీ పారాయణం పదివేలు, కోటి నవర్ణావ పూజ ఉంటాయి. అయుత చండీయాగం పద్దతులు డామర తంత్రంలో, సప్తశతీ సర్వస్వంలో, చండీకోపార్చన రహస్యంలో దొరుకుతాయి. 1200 సంవత్సరాల క్రితం జగద్గురు ఆది శంకరాచార్యులు శృంగేరి శారదాపీఠం నెలకొల్పినప్పుడు ప్రతిష్ట చేసిన ఉభయ భారతీ దేవి అమ్మవారి దగ్గర సప్తశతీ పారాయణం జరగాలని, దానికి కొన్ని నియమ నిష్టలు ఉండాలని ఆది శంకరాచార్య సూచించారు. దాని ప్రకారమే ప్రస్తుత చండీయాగం జరుగుతన్నది అని ఆన్నారు.

 

Tags :