ASBL NSL Infratech

బాసర ఆర్‌జియుకెటితో ఆటా ఎంఓయు... విద్యార్థులతో జయంత్‌ చల్లా ముఖాముఖి 

బాసర ఆర్‌జియుకెటితో ఆటా ఎంఓయు... విద్యార్థులతో జయంత్‌ చల్లా ముఖాముఖి 

విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని ఆటా వేడుకల చైర్‌, ఎలెక్ట్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ చల్లా కోరారు. ఆటా సేవ కార్యక్రమాల్లో భాగంగా ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లా, సరస్వతి దేవి సమీపాన వెలసిన బాసరలో గల రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీస్‌ త్రిబుల్‌ ఐటీతో ఆటా ఎంఓయు కుదుర్చుకుంది. అలాగే విద్యార్థులతో వాక్‌ థాన్‌, మెంటల్‌ స్ట్రెస్‌ వంటి వివిధ అంశాలపై ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని ప్రతిభ గల విద్యార్థులకు సర్టిఫికెట్స్‌ అందించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి యూనివర్సిటీ విసి ప్రొఫెసర్‌ వెంకటరమణ సభ అధ్యక్షత వహించగా, జయంత్‌ చల్లా మాట్లాడుతూ ఎందరో ప్రతిభ గల విద్యార్థులకు నిలయం ఆర్‌జియుకెటి అన్నారు. ఇక్కడికి వచ్చే విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల గవర్నమెంట్‌ స్కూల్స్‌ నుండి వచ్చిన వారు అన్నారు. ఈ ఆర్‌జియుకెటి ద్వారా ఎందరో ఉన్నతమైన స్థానాలకు ఎదిగారు అన్నారు. విద్యార్థులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశ్యంతో ఎంఓయు కుదుర్చుకున్నాం అన్నారు.

ఈ ఎంఓయు ద్వారా వచ్చే 2 ఏళ్ల పాటు ఆటా ప్రొఫెసర్స్‌ వచ్చి విద్యార్థులతో వివిధ అంశాలపై లెక్చర్‌ ఇస్తారు అన్నారు. ఇలా ఒక్క రోజు విద్యార్థులతో గడపడం మాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. విద్యార్థులకు ఆటా తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది అన్నారు. అలాగే ఈ యూనివర్సిటీ నుండి అధికంగా విద్యార్థులు ఎంటర్పెన్యుర్స్‌ గా రావడానికి తమ వంతుగా కృషి చేస్తామన్నారు. ముఖాముఖిలో భాగంగా విద్యార్థులు అడిగిన సందేహాలను ఆటా ప్రతినిధులు నివృత్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్‌ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్‌ రెడ్డి, 18వ ఆటా కాన్ఫరెన్స్‌ నేషనల్‌ కో ఆర్డినేటర్‌ సాయి సుధిని, ఆటా జాయింట్‌ సెక్రటరీ రవీందర్‌ గూడూరు, ఆటా బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌ నరసింహారెడ్డి ద్యాసాని, కాశీ కొత్త, నర్సిరెడ్డి గడ్డికొప్పుల ఆటా ఇండియా ఆర్డినేటర్‌ అమృత్‌ ముళ్లపూడి, ఆర్‌జియుకెటి డైరెక్టర్‌ సతీష్‌, డా. పావని తదితరులు పాల్గొన్నారు.

 

Click here for Photogallery

 

 

Tags :