CP Radhakrishnan: ఎన్డీయేలో ఉన్నప్పుడు ప్రతిపక్ష అభ్యర్థికి ఎలా మద్దతు ఇస్తాం? : చంద్రబాబు

దేశం గౌరవించదగిన వ్యక్తి ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ (Radhakrishnan) అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఢల్లీిలో సీఎం ఆయన్ను కలిశారు. అనంతరం మీడియాతో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఎన్డీయే (NDA) భాగస్వామ్య పక్షాలు సీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి (Vice President) అభ్యర్థిగా ఎంపిక చేశాయి. ఆయనకు మా మద్దతు ఉంటుందని చెబుతూ అభినందనలు తెలిపాను. దేశానికి, ఉపరాష్ట్రపతి పదవికీ సీపీ రాధాకృష్ణన్ గౌరవం తీసుకొస్తారు. ఎన్నికల ముందు నుంచి ఎన్డీయేలో టీడీపీ (TDP) ఉంది. ఆ అభ్యర్థికే మా మద్దతు ఉంటుంది. తెలుగువాడు అన్నప్పుడు గెలిచే అవకాశం ఉంటేనే అభ్యర్థిని పెట్టాలి. గెలిచే అవకాశం లేకపోయినా అభ్యర్థిని పెట్టి ఇండియా కూటమి రాజకీయం చేస్తోంది. ఎన్డీయేలో ఉన్నప్పుడు ప్రతిపక్ష అభ్యర్థికి ఎలా మద్దతు ఇస్తాం? అని అన్నారు.