ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అందాల పోటీలో ఏఐ భామలు

అందాల పోటీలో ఏఐ భామలు

అందుగలదని, ఇందుగలదని సందేహం వలదు. ఎందెందు వెతికినా అందందే కలదు అని ఇప్పుడు కొత్తగా ఏఐ గురించి చెప్పుకోవాలి. కృత్రిమ మేధ ప్రవేశించని రంగమే లేదు. తాజాగా ఏఐ సృష్టించిన భామల మధ్య అందాల పోటీలు కూడా జరగబోతున్నాయని వరల్డ్‌ ఏఐ క్రియేటర్‌ అవార్డ్స్‌ వెల్లడిరచినట్టు తెలిసింది. మిస్‌ ఏఐ పోటీలో నెగ్గిన విజేతలకు 20 వేల డాలర్ల ప్రైజ్‌ మనీ కూడా ఇవ్వనున్నారు. ఈ భామల లుక్స్‌తో పాటు వీటి తయారీకి ఉపయోగించిన టెక్నాలజీ,సోషల్‌ మీడియాలో వీటి ప్రభావం తదితర అంశాలన్నీ విజేత ఎంపీకలో పరిగణలోకి తీసుకోబోతున్నారు. ఈ పోటీల కోసం ఏప్రిల్‌ 21 నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మే 10న విజేతలను ప్రకటించనున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :