ASBL NSL Infratech

మ‌రో తెలుగు సినిమాకు ఓకే చెప్పిన దుల్క‌ర్

మ‌రో తెలుగు సినిమాకు ఓకే చెప్పిన దుల్క‌ర్

మ‌హాన‌టి, సీతారామం సినిమాల‌తో టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ద‌క్కించుకున్నాడు మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్. వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న దుల్క‌ర్ క‌మ‌ల్ థ‌గ్ లైఫ్ లో కూడా న‌టిస్తున్నాడ‌ని వార్త‌లొస్తున్నాయి. ఇదిలా ఉంటే దుల్క‌ర్ టాలీవుడ్ లో మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇన్ సైడ్ టాక్ ప్ర‌కారం ఆ సినిమాను సుధాక‌ర్ చెరుకూరి నిర్మించ‌నున్నాడు.

ఈ సినిమా ద్వారా ర‌వికాంత్ అనే కొత్త ద‌ర్శ‌కుడు టాలీవుడ్ కు ప‌రిచ‌యం కాబోతున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ డిస్క‌ష‌న్స్ జ‌రిగాయి. అతి త్వ‌ర‌లోనే షూటింగ్ ను స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. ద‌స‌రా సినిమాతో మంచి నిర్మాత‌గా పేరు తెచ్చుకున్న సుధాక‌ర్ బ్యాన‌ర్ లో ఇప్ప‌టికే రెండు సినిమాలు వేర్వేరు ద‌శ‌ల్లో ఉన్నాయి.

దుల్క‌ర్ స‌ల్మాన్ తో చెరుకూరి సుధాక‌ర్ చేయ‌బోయే సినిమా ఎలా ఉంటుంద‌నేది చూడాలి. ఇక దుల్క‌ర్ విష‌యానికొస్తే కెరీర్ లో చాలా జోరు మీదున్నాడు. ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు దుల్క‌ర్. వేరే హీరోలు ఏడాదికి ఒక‌టి రెండు సినిమాలు చేయ‌డానికే తెగ క‌ష్ట‌ప‌డుతుంటే దుల్క‌ర్ మాత్రం ఈ విష‌యంలో అంద‌రికంటే ముందున్నాడు.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :