ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

లైలాగా విశ్వ‌క్సేన్

లైలాగా విశ్వ‌క్సేన్

టాలీవుడ్ లో వ‌రుస సినిమాల‌తో దూసుకెళ్తున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వ‌క్సేన్. హీరోగానే కాకుండా విశ్వ‌క్.. ర‌చ‌న‌, ద‌ర్శక, నిర్మాణ బాధ్య‌త‌లు కూడా నిర్వ‌ర్తిస్తూ త‌న‌ను తాను నిరూపించుకుంటూ వ‌స్తున్నాడు. కెరీర్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ విశ్వ‌క్ రోజురోజుకీ బెస్ట్ పొజిష‌న్ కు వెళ్తున్నాడు. రీసెంట్ గా గామి సినిమాతో మంచి హిట్ ను అందుకున్న విశ్వ‌క్, త్వ‌ర‌లోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

గోదావ‌రి నేప‌థ్యంలో విల‌జ్ పొలిటిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా వేస‌వి కానుక‌గా మే 17న రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే విశ్వ‌క్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా తాజాగా రెండు సినిమాలు అధికారికంగా అనౌన్స్ అయ్యాయి. అందులో ఒక సినిమా మాత్రం విశ్వ‌క్ ఫ్యాన్స్ ను తెగ ఎగ్జైట్ అయ్యేలా చేస్తుంది. విశ్వ‌క్ కెరీర్లో 12వ సినిమాగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకు రామ్ నారాయ‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా ఇది రూపొంద‌నుంది. విశ్వ‌క్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా టైటిల్ పోస్టర్ తో పాటూ మోష‌న్ పోస్ట‌ర్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్ట‌ర్ ద్వారా సినిమా టైటిల్ ను లైలా అని అనౌన్స్ చేశారు. ఇకపోతే పోస్ట‌ర్ లో ఉన్న పూలు, సీతాకోక చిలుక‌లు, కొవ్వొత్తి, అద్దం, మేక‌ప్ కిట్, రేడియో, చార్మినార్, తుపాకి, క‌త్తి ఇవ‌న్నీ ఆడియ‌న్స్ లో సినిమాపై అంచ‌నాలను పెంచుతున్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విశ్వ‌క్ లేడీ గెట‌ప్ లో క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం. చూస్తుంటే విశ్వ‌క్ ఈసారి స‌రికొత్త‌గా ఆడియ‌న్స్ ను ఇంప్రెస్ చేయ‌నున్న‌ట్లు అనిపిస్తుంది. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :