కమల్, రజినీ మధ్య చరణ్
కమల్ హాసన్ ఫ్యాన్స్ తో పాటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఇండియన్2 రిలీజ్ డేట్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. జూన్ 13న సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసి ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు లీకులందుతున్నాయి. అంతేకాదు వచ్చే నెల మే 16న ఇండియన్2 ఆడియో లాంచ్ ఈవెంట్ ను చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
అప్పటికి ఎలక్షన్స్ హడావిడి కూడా తగ్గిపోతుంది కాబట్టి అదే ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి సరైన టైమ్ అనుకుంటున్నారట చిత్ర యూనిట్. ఇక అసలు విషయానికొస్తే ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్టులగా సూపర్ స్టార్ రజినీకాంత్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రావడం దాదాపు ఫిక్సైనట్లేనని మీడియా వర్గాలంటున్నాయి. గేమ్ ఛేంజర్ డైరెక్టర్ శంకరే కాబట్టి చరణ్ నో చెప్పే ఛాన్స్ ఉండదు. పైగా కమల్ సినిమా ఈవెంట్. ఇక శంకర్ అడిగితే రజినీ కాదనడు. మరోవైపు కమల్ తనకు ప్రాణ స్నేహితుడు. ఈ వార్త నిజమైతే మాత్రం ఓ వైపు లోక నాయకుడు, మరోవైపు సూపర్ స్టార్ మధ్య చరణ్ కనిపించడం ఫ్యాన్స్ కు కన్నుల పండగగా ఉండటం ఖాయం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్సుంది.