ASBL NSL Infratech

పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకి గుణపాఠం చెప్పాలి: తెలంగాణ మంత్రి సీతక్క

పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకి గుణపాఠం చెప్పాలి: తెలంగాణ మంత్రి సీతక్క

దురహంకారంతో రెచ్చిపోతున్న ప్రధాని మోదీకి ప్రజలు గుణపాఠం చెప్పాలంటూ తెలంగాణ మంత్రి సీతక్క ఫైరయ్యారు. ఓట్ల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడం, ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తామని అనడం, భారత రాజ్యాంగం మారుస్తామంటూ అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్న మోదీని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. కొమురం భీం అసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ సీతక్క ఈ వ్యాఖ్యలు చేశారు. 
‘బీజేపీ ఓట్ల కోసం దేవుళ్లని వాడుకుంటోంది. అయోధ్యలో మందిరం కట్టారు సరే.. కానీ శ్రీరాముడిని కూడా ఎన్నికల కోసం వాడుకోవడం ఏంటి? అయోధ్య మందిరం కోసం ఊళ్లలో డబ్బులు వసూలు చేశారు.. కానీ ఊళ్లలో ఒక్క రోడ్డు కూడా వేయించలేదు. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని ప్రైవేటుపరం చేయాలని చూస్తోంది. ఈ ప్రైవేటీకరణ ముందు మోదీ ఉంటే.. ఆయన వెనుక అంబానీ, అదానీలుంటారు’’ అంటూ బీజేపీపై సీతక్క ఘాటు విమర్శలు చేశారు.

అనంతరం బీఆర్ఎస్ సర్కార్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సీతక్క.. ‘‘ఎన్నికలుంటేనే కేసీఆర్ బయటకు వస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఫాం హౌస్‌‌లో కుంభకర్ణుడిలా నిద్రపోతారు. పదేళ్ళ  బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. ఆ అప్పులకు వడ్డీలు కట్టలేని పరిస్థితి ఉంది. అహంకార, కుటుంబ పాలనను చూసిన ప్రజలు ఆ పార్టీకి గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిపాలకులు కాదు, ప్రజా సేవకులు. బడుగు, బలహీన వర్గాల వారందరినీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే సమానంగా ఆదరిస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి’’ అని పిలుపునిచ్చారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :