అది ఒక్క సుకుమార్‌కే చెల్లింది
టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ డైరెక్టర్లున్నారు. వారి దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా మారిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ ఈ తరంలో తన శిష్యులను ఎంకరేజ్ చేసి వారి కెరీర్ కు బాటలు వేసే డైరెక్టర్ గా సుకుమార్ మాత్రమే ఉన్నాడు. మిగిలిన స్టార్ డైరెక్టర్ల శిష్యుల్లో ఎంతమంది డైరెక్టర్లుగా మారి మంచి పేరు సంపాదించారంటే ఆన్సర్ కోసం వెతుక్కోవాల్సి ఉంటుంది.
కానీ సుక్కు శిష్యరికంతో డైరెక్టర్లుగా మారిన వాళ్ల లిస్ట్ మాత్రం పెద్దదే. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన బుచ్చిబాబు సాన నుంచి దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, కుమారి 21ఎఫ్ డైరెక్టర్ సూర్య ప్రతాప్, విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు, ప్లే బ్యాక్ డైరెక్టర్ హరిప్రసాద్ జక్కా లాంటి టాలెంటెడ్ డైరెక్టర్లంతా మన సుకుమార్ శిష్యులే. మామూలుగా స్టార్ డైరెక్టర్లందరూ తమ శిష్యులను ఎంకరేజ్ చేసి డైరెక్టర్లవడానికి హెల్ప్ చేయరు.
కానీ సుకుమార్ మాత్రం తన దగ్గర పని చేసిన ప్రతి అసిసెంట్ డైరెక్టర్ కావాలని తపన పడుతుంటాడు. కుదిరితే వారితో తన బ్యానర్లోనే సినిమాలు చేయడమో లేదంటే బయట ఛాన్స్ ఇప్పించడంలోనో హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలాగే తన శిష్యులు తీసిన సినిమాలను కూడా దగ్గరుండి మరీ ప్రమోట్ చేస్తూ, వారి గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు. స్టార్ డైరెక్టర్ అనే గర్వం ఏ మాత్రం చూపించకుండా తన శిష్యులు లేకపోతే తాను అంత బాగా సినిమాలు చేయగలిగేవాడిని కాదన్నట్లు మాట్లాడతాడు. రీసెంట్ గా ప్రసన్నవదనం డైరెక్టర్ అర్జున్ గురించి కూడా సుక్కూ ఇలానే మాట్లాడాడు. అర్జున్ తన శిష్యుడని, లాజిక్ తో ముడిపడ్డ సినిమాలన్నీ అర్జున్ సాయంతోనే రాశానని, అర్జున్ తన దగ్గర నుంచి వెళ్లాక లాజిక్ సినిమాలు చేయడం మానేసినట్లు సుకుమార్ ఓ రేంజ్ లో ఎలివవేషన్లు ఇచ్చాడు. ఓ శిష్యుడి గురించి ఇంతలా పొగడటం ఒక్క సుకుమార్ కే చెల్లింది.