ASBL NSL Infratech

ఇక గేమ్ ఛేంజ‌ర్ ఒక్క‌టే బ్యాలెన్స్

ఇక గేమ్ ఛేంజ‌ర్ ఒక్క‌టే బ్యాలెన్స్

ఈ ఏడాది టాలీవుడ్ నుంచి రాబోతున్న పెద్ద సినిమాల‌న్నీ ఇప్ప‌టికే రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకున్నాయి. ఎప్ప‌టినుంచో సస్పెన్స్ ఉన్న క‌ల్కి రిలీజ్ డేట్ క్లారిటీ కూడా వీడింది. క‌ల్కి 2898ఏడి సినిమా జూన్ 27న రిలీజ్ కానున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా వాయిదా ప‌డే ఛాన్స్ దాదాపు లేన‌ట్టే. క‌ల్కి కాకుండా మిగిలిన పాన్ ఇండియా సినిమాలు కూడా ఇప్ప‌టికే రిలీజ్ డేట్స్ ను ఫిక్స్ చేసుకున్నాయి. పుష్ప2 ఆగ‌స్ట్ 15న రిలీజ్ కానుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ సెప్టెంబ‌ర్ 27న రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తున్న మ‌రో పాన్ ఇండియా సినిమా దేవ‌ర అక్టోబ‌ర్ 10న రిలీజ్ కానుంది.  

ఇవి కాకుండా టాలీవుడ్ నుంచి వ‌స్తున్న మ‌రో భారీ సినిమా అంటే రామ్ చ‌ర‌ణ్ గేమ్ చేంజ‌ర్. మూడేళ్ల కింద‌టే మొద‌లైన ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు టాకీ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందంటున్నారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ కు ఇంకా టైమ్ పట్ట‌నుంది. అక్టోబ‌ర్లో రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు కానీ ఆ నెల‌లో ఇప్ప‌టికే ప‌లు సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. ర‌జినీ వేట్ట‌యాన‌, సూర్య కంగువ కూడా అక్టోబ‌ర్ లోనే రిలీజ్ కానున్నాయి. మ‌రి ఈ పోటీలో గేమ్ ఛేంజ‌ర్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఈ సినిమాకు ఏ డేట్ ను ఫిక్స్ చేస్తాడో చూడాలి.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :