ASBL NSL Infratech

ఊర మాస్ అవ‌తార్‌లో స‌మంత‌

ఊర మాస్ అవ‌తార్‌లో స‌మంత‌

స‌మంత మ‌ళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు చేస్తుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు త‌న కొత్త సినిమా తాలూకు అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. బంగారం పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు ఇంకా ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, క్యాస్టింగ్ వివ‌రాలేవీ లేకుండా జ‌స్ట్ స్టిల్ ను మాత్ర‌మే రిలీజ్ చేశారు. టైటిల్ పైన చిన్న‌గా మా ఇంటి అనే క్యాప్ష‌న్ ను కూడా పెట్టారు.

పోస్ట‌ర్ లో స‌మంత ఎర్ర చీర క‌ట్టుకుని నుదుట గాయంతో చేతిలో తుపాకీ, ఏదో రివెంజ్ కోసం ఎదురుచూస్తున్న‌ట్లు చాలా డిఫ‌రెంట్ గా ఉంది. గ‌తేడాది శాకుంత‌లం డిజాస్ట‌ర్ తో నిరాశ చెందిన స‌మంత‌, ఆ త‌ర్వాత ఖుషి తో కాస్త ఊర‌ట పొందింది కానీ అనుకున్న ఫ‌లితాన్నైతే అందుకోలేక‌పోయింది.  ఇక అమెజాన్ ప్రైమ్ తీసిన సిటాడెల్ రిలీజ్ లేట‌వుతూ వ‌స్తుంది. ప్ర‌స్తుతం స‌మంత ఆశ‌ల‌న్నీ సిటాడెల్ పైనే పెట్టుకుంది. ఎన్ని ఆఫ‌ర్లొచ్చినా ఎదురుచూస్తూ మొత్తానికి స‌రైన టైమ్ లో సినిమాను అనౌన్స్ చేసింది. చూస్తుంటే ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ మూవీలా అనిపిస్తుంది. కాక‌పోతే సోష‌ల్ మెసెజ్ లాంటివి లేకుండా స‌మంత ఏదో సీరియ‌స్ థీమ్ లోనే ట్రై చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :