ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

నాగ్ బాటలో వెంకీ

నాగ్ బాటలో వెంకీ

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేసి దాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసి మంచి హిట్స్ అందుకున్నాడు టాలీవుడ్ కింగ్ నాగార్జున. దీంతో వ‌చ్చే ఏడాది కూడా సంక్రాంతికి మ‌రో సినిమాను రిలీజ్ చేస్తాన‌ని నాగ్ ఇప్ప‌టికే వెల్ల‌డించాడు. ఇప్పుడు నాగార్జున దారిలోనే విక్ట‌రీ వెంక‌టేష్ కూడా న‌డుస్తున్నట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం వెంకీ, అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే.

ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానుంది. జూన్ లేదా జులై నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను పూర్తి విలేజ్ బ్యాక్ స్టోరీతోనే అనిల్ రెడీ చేస్తున్నాడ‌ట‌. ఈ సినిమాలో వినోదంతో పాటూ మ‌రికొన్ని స్పెష‌ల్ ఎలిమెంట్స్ కూడా ఉండ‌బోతున్నాయ‌ని తెలుస్తోంది.

ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజుకు కూడా సంక్రాంతి సెంటిమెంట్ ఉండ‌టంతో ఈ సినిమాను సంక్రాంతి బ‌రిలో దించాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు టార్గెట్ గా పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. వెంకీ చాలా కాలం త‌ర్వాత ఆడియ‌న్స్ ను గ్రామీణ వాతావ‌ర‌ణంలోకి తీసుకెళ్ల‌డానికి రెడీ అవుతున్నాడు. విలేజ్ నేటివిటీ సినిమాల‌కు సంక్రాంతి సీజ‌న్ లో ఎంతటి ప్రాముఖ్య‌త ఉంటుందో తెలిసిందే. అందుకే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సినిమాను టార్గెట్ మిస్ చేయ‌కుండా రిలీజ్ చేయాల‌ని చూస్తున్నాడ‌ట దిల్ రాజు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :