ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ప‌వ‌న్ సినిమాకు, తేజ స‌జ్జ సినిమాకు పోలిక‌

ప‌వ‌న్ సినిమాకు, తేజ స‌జ్జ సినిమాకు పోలిక‌

ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న సినిమాల్లో అన్నింటికంటే ఎక్కువ క్రేజ్ ఉన్న సినిమా ఓజీ. సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ పై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి. ప్ర‌స్తుతం పవ‌న్ ఏపీ ఎల‌క్ష‌న్స్ హ‌డావిడిలో బిజీగా ఉండ‌టంతో ఆ సినిమా షూటింగ్ కు బ్రేక్ ప‌డింది. ఈ ఏడాది జులై లేదా ఆగ‌స్ట్ నుంచి మ‌ళ్లీ షూటింగ్ రీస్టార్ట్ అయ్యే ఛాన్సుంది.

ఎప్పుడూ ఏదో విధంగా వార్త‌ల్లో ఉంటున్న ఓజీ సినిమా ఇప్పుడు మ‌రోసారి చ‌ర్చ‌ల్లోకెక్కింది. హ‌నుమాన్ త‌ర్వాత తేజ స‌జ్జ హీరోగా మిరాయ్ అనే సినిమా రూపొందుతుంది. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఆ సినిమా టైటిల్, ఇత‌ర విష‌యాల‌ను చూస్తుంటే మిరాయ్, ఓజీని పోలి ఉండేట్లు అనిపిస్తుంది.

ఈ పోలిక‌ను హీరో తేజ స‌జ్జ కూడా ఒప్పుకున్నాడు. మిరాయ్ అనే సూప‌ర్ యోధా టైటిల్ ను టాలీవుడ్ లో ఏ హీరోకైనా ఇవ్వాలంటే నేను ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారికి ఇస్తానన్నట్లు చెప్పుకొచ్చాడు. ఓజీ గ్లింప్స్ లో ప‌వ‌న్ క‌త్తి ప‌ట్టి తిప్ప‌డం, ఆ టైటిల్ ఫాంట్ మిరాయ్ కు ద‌గ్గ‌ర‌గా ఉంటాయ‌ని, కానీ సినిమాలు మాత్రం విభిన్నంగా ఉంటాయ‌ని తేజ చెప్తున్నాడు. ఇదిలా ఉంటే మిరాయ్ సినిమాలో తేజ సజ్జ మ‌రోసారి సూప‌ర్ హీరోగా క‌నిపించ‌బోతున్నాడు.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :