ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

హిట్ల‌తో దూసుకెళ్తున్న శ్రీవిష్ణు

హిట్ల‌తో దూసుకెళ్తున్న శ్రీవిష్ణు

ఓ ఏడాది ముందు వ‌ర‌కు శ్రీ విష్ణు కెరీర్ చాలా ఇబ్బందుల్లో ఉండేది. వ‌రుస‌గా త‌న అకౌంట్ లో మూడు డిజాస్ట‌ర్లు ప‌డ్డాయి. అర్జున ఫ‌ల్గుణ‌, భ‌ళా తంద‌నాన‌, అల్లూరి సినిమాలు త‌న‌కు పూర్తి నిరాశను మిగిల్చి త‌న మార్కెట్ ను బాగా దెబ్బతీశాయి. దాన్నుంచి శ్రీ విష్ణు ఎలా కోలుకుంటాడా అనుకునే టైమ్ లో సామ‌జ‌వ‌ర‌గ‌మన మూవీ అత‌నికి మంచి రిలీఫ్ ను ఇచ్చింది.

ఓ మోస్త‌రు హిట్ కోసం వెయిట్ చేస్తున్న శ్రీవిష్ణు కు సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ల‌భించింది. ఆ సినిమా స‌క్సెస్ ఇచ్చిన జోష్ లో శ్రీవిష్ణు త‌న త‌ర్వాతి సినిమాల విష‌యంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. దాని ఫ‌లిత‌మే శ్రీవిష్ణు కొత్త సినిమా ఓం భీం బుష్. గ‌త వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి బ‌జ్ తో రిలీజై డివైడ్ టాక్ ను తెచ్చుకుంది.

మొద‌టి రోజు ఐపీఎల్ ఎఫెక్ట్ వ‌ల్ల ఓపెనింగ్స్ అనుకున్న స్థాయిలో రాలేదు. కానీ రెండో రోజు నుంచి సినిమా పుంజుకుంది. వ‌రుస‌గా మూడు రోజులు మొద‌టి రోజును మించి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది ఈ సినిమా. సోమ‌వారం హోళీ కావడం ఈ సినిమాకు బాగా క‌లిసొచ్చింది. నాలుగు రోజుల్లోనే సినిమా రూ.20 కోట్ల మేర క‌లెక్ష‌న్స్ సాధించి హిట్ దిశ‌గా అడుగులేస్తుంది. ఇప్ప‌టికే సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. మొత్తానికి శ్రీవిష్ణుకి మూడు డిజాస్ట‌ర్ల త‌ర్వాత రెండు హిట్లు మంచి ఉప‌శ‌మ‌నాన్నిచ్చాయి.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :