ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

డార్లింగ్ విజ‌య్ ఆల్ ది బెస్ట్: ర‌ష్మిక‌

డార్లింగ్ విజ‌య్ ఆల్ ది బెస్ట్: ర‌ష్మిక‌

రౌడీ హీరో విజయ్ దేవ‌ర‌కొండ‌, మృణాల్ ఠాకూర్ జంట‌గా ప‌రశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా రూపొందిన ఈ సినిమాపై ఆడియ‌న్స్ లో మంచి అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే రిలీజైన టీజ‌ర్, ట్రైల‌ర్, సాంగ్స్ కు ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

ఈ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాల‌ని చూస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. మృణాల్ కూడా ఈ సినిమాతో విజ‌యాన్ని అందుకుని హ్యాట్రిక్ అందుకోవాల‌ని చూస్తుంది. ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఫ్యామిలీ స్టార్ ప్ర‌మోష‌న్స్ ఇప్ప‌టికే ఫుల్ స్వింగ్ లో జ‌రుగుతున్నాయి. చిత్ర యూనిట్ అంతా ప్ర‌మోష‌న్స్ లో పాల్గొని సినిమాను జ‌నాల్లోకి తీసుకెళ్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా టీమ్ కు నేష‌న‌ల్ క్ర‌ష్, స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్నా విష్ చేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. డార్లింగ్స్ విజ‌య్, ప‌ర‌శురామ్ ఆల్ ది బెస్ట్. ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను. సినిమా క‌చ్ఛితంగా హిట్ అవుతుంది. నాకు పార్టీ కావాలి. మృణాల్ ఆల్ ది బెస్ట్ మై లవ్ అంటూ ట్వీట్ చేసింది. ర‌ష్మిక పోస్ట్ ను విజ‌య్ రీపోస్ట్ చేశాడు. దీంతో ప్ర‌స్తుతం వారిద్ద‌రి ట్వీట్స్ నెట్టింట్ ఫుల్ వైర‌ల్ గా మారాయి. ఇప్ప‌టికే వీరిద్ద‌రి మ‌ధ్య సీక్రెట్ రిలేష‌న్‌షిప్ న‌డుస్తుంద‌ని వార్త‌లొస్తున్నాయి. ఇప్పుడు ర‌ష్మిక ఇలా స్పెష‌ల్ గా ట్వీట్ చేయ‌డంతో ఆ డౌట్స్ మ‌రింత బ‌ల‌ప‌డుతున్నాయి. ఖుషి త‌ర్వాత విజ‌య్ చేస్తున్న ఈ సినిమా త‌న‌కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :