ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రెండు భాగాలుగా ఎన్టీఆర్ - నీల్ మూవీ

రెండు భాగాలుగా ఎన్టీఆర్ - నీల్ మూవీ

దేవర షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ వ‌చ్చే నెల నుంచి వార్2 షూటింగ్ లో కూడా జాయిన్ కానున్నాడు. దేవ‌ర మొద‌టి భాగం అక్టోబ‌ర్ 10న రిలీజ్ కానుంది. రిలీజ్ కు ఎంతో టైమ్ లేనందున షూటింగ్ ను వేగ‌వంతం చేస్తున్నాడు డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. దేవ‌ర త‌ర్వాత ఎన్టీఆర్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే.

వాస్త‌వానికి నీల్- ఎన్టీఆర్ సినిమా స‌మ్మ‌ర్ లోనే స్టార్ట్ చేద్దామ‌నుకున్నారు. కానీ ఎన్టీఆర్ డేట్స్ అందుబాటులో లేక‌పోవ‌డం వ‌ల్ల పోస్ట్ పోన్ చేయ‌క త‌ప్ప‌లేదు. ఒక‌వేళ దేవ‌ర ముందు అనుకున్న‌ట్లు ఏప్రిల్ 5న రిలీజ్ అయితే ఇది సాధ్య‌మ‌య్యేది. దీంతో ప్ర‌శాంత్ నీల్ ప్ర‌స్తుతం స‌లార్2కు రెడీ అవుతున్నాడు.

ప్ర‌భాస్ డేట్స్ ఇచ్చేస్తే వెంట‌నే షూట్ స్టార్ట్ చేసేస్తాడు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తో నీల్ చేయ‌బోయే క‌థ‌ను రెండు భాగాలుగా చెప్పాల‌నే ఆలోచ‌న‌లో నీల్ ఉన్నాడ‌ని అంత‌ర్గ‌త వ‌ర్గాల నుంచి తెలుస్తోంది. కెజిఎఫ్ త‌ర‌హాలో పెద్ద స్పాన్ కావ‌డంతో మూడు గంటల్లో చెప్ప‌లేమ‌ని, రెండో భాగంగా కొన‌సాగిస్తే బావుంటుంద‌ని నీల్ అనుకుంటున్నాడ‌ట‌. దీనికి నిర్మాత‌లైన మైత్రీ మూవీ మేక‌ర్స్ కూడా రెడీగానే ఉంది కానీ ఎన్టీఆర్ మాత్రం ఇంకా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. రెండు భాగాలంటే ఎక్కువ మొత్తంలో కాల్షీట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబ‌ట్టి ఎన్టీఆర్ ఫ్రీ అయ్యేవ‌ర‌కు ఈ విష‌యంలో క్లారిటీ అంత తేలిక‌గా రాదు.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :