ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

పుష్ప2 గురించి మ‌రో పుకారు

పుష్ప2 గురించి మ‌రో పుకారు

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వ‌స్తున్న పుష్ప2 సినిమాకు సంబంధించి రోజుకో వార్త నెట్టింట ప్ర‌చార‌మ‌వుతుంది. వాటిలో స‌మంతా మ‌రోసారి బ‌న్నీతో క‌లిసి స్పెష‌ల్ సాంగ్ చేయ‌నుంద‌ని కూడా టాక్ వినిపిస్తుంది. పుష్ప‌1లో ఊ అంటావా మావా అంటూ ప్ర‌పంచాన్ని షేక్ చేసిన స‌మంత మ‌రోసారి బ‌న్నీ తో క‌లిసి కాలు క‌ద‌ప‌నుందని, పుష్ప‌లో కొన్ని డైలాగ్స్ తో కూడిన సీన్స్ ను పెట్టార‌ని నెట్టింట ప్ర‌చార‌మ‌వుతుంది.

కానీ అవేవీ నిజం కాద‌ని, అస‌లు ఆ ఆలోచ‌న కూడా సుకుమార్ లో లేద‌ని యూనిట్ స‌భ్యులంటున్నారు. స్పెష‌ల్ సాంగ్ కోసం హీరోయిన్ ను వెతుకుతున్న మాట నిజ‌మే కానీ అందులో ప‌డి అస‌లు సినిమాను రిస్క్ లో పెట్ట‌డం లేదు. ముందు సినిమా టాకీ పార్ట్ ను పూర్తి చేయాల‌ని సుకుమార్ రేయ‌న‌క ప‌గ‌ల‌న‌క క‌ష్ట‌ప‌డుతున్నాడు.

స్క్రిప్ట్ డిమాండ్ చేయడంతో యాగంటికి లో కీల‌క షెడ్యూల్ ను ప్లాన్ చేసి షూట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే దేవీ త‌న సాంగ్స్ ను పూర్తి చేసి రీరికార్డింగ్ కాపీ కోసం వెయిట్ చేస్తున్నాడు. సినిమాను ఎట్టి ప‌రిస్థితుల్లో చెప్పిన‌ట్టుగానే ఆగ‌స్ట్ 15న రిలీజ్ చేయాల‌ని హీరో, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు డిసైడ్ అయ్యారు. రిలీజ్ కు ఇంకా 4 నెల‌లే టైముండ‌టంతో అన్నీ ప్లాన్ ప్ర‌కారం చేయాల‌ని ముందుకెళ్తున్నార‌ట బ‌న్నీ, సుకుమార్. ప్ర‌మోష‌న్స్ ను జూన్ నుంచి మొద‌లుపెట్టాల‌ని చూస్తున్నారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :