జీ తెలుగు అందిస్తోన్న సరికొత్త సీరియల్ ‘సీతే రాముడి కట్నం’

ఆసక్తికరమైన మలుపులు, అదిరిపోయే ట్విస్ట్‌లతో సాగే సీరియల్స్‌ను అందిస్తున్న జీ తెలుగు మరో ఆసక్తికరమైన అంశంతో సాగే సీరియల్‌ను తన అభిమాన వీక్షకులకు అందించేందుకు సిద్ధమైంది. ఆసక్తికరమైన కథ, కథనంతో అత్తాకోడళ్ల మధ్య సాగే సరికొత్త సీరియల్ ‘సీతే రాముడి కట్నం’. ఈ సీరియల్లో అత్తాకోడళ్ల మధ్యనున్న ప్రత్యేకమైన బంధాన్ని కొత్తకోణంలో చూపించనున్నారు. అనుకోకుండా ముడిపడే సీతారాముల బంధం, సహజమైన అందంతో ఆత్మసంతృప్తికి ప్రాధాన్యమిచ్చే కోడలు, ఆకర్షించే బాహ్యసౌందర్యమే ప్రధానమైనదని భావించే అత్త మధ్య సాగే ఈ కథలోని మలుపులు సీరియల్‌ని మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. అనూహ్యమైన కథతో రానున్న ‘సీతే రాముడి కట్నం’ అక్టోబర్ 2న ప్రారంభం, సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు, మీ జీ తెలుగులో!
ఈ సీరియల్ కథ నిరాడంబరత, నిష్కల్మషమైన మనసుతో నిజాయితీగా జీవించే సీత అనే సాధారణ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. సీత ఫ్యాషన్‌పై అభిరుచి, మంచి నైపుణ్యంగల టైలర్ కూడా. నిజాయితీపరుడైన రామ్ పోలీస్ కావాలని కలలు కంటూ తన తల్లి ఆదేశం మేరకు తమ కుటుంబపరమైన వ్యాపారాన్ని చూసుకుంటూ ఉంటాడు. మహాలక్ష్మి కి ఎన్నో వ్యాపారాలు ఉన్న కాస్మెటిక్ కంపెనీ అంటే చాలా ఇష్టం. అందానికే మొదటి ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి మహాలక్ష్మి(రామ్ తల్లి). తానెంతగానో ప్రేమించే తన కొడుకు భవిష్యత్తుపై కలలు కంటుంది. అందమైన అమ్మాయిని ఇచ్చి కొడుక్కి పెళ్లి చేయాలని ఆశపడుతుంది. అందంగా లేని దేన్నైనా ద్వేషించే మహాలక్ష్మి తనకు ఎంతమాత్రం నచ్చని సీతను కోడలుగా పొందుతుంది. మరి సీత తన అత్త మహాలక్ష్మిని ఎలా మెప్పిస్తుంది? అనేది తెలుసుకోవాలంటే జీ తెలుగులో ప్రసారం కానున్న ‘సీతే రాముడి కట్నం’ సీరియల్ తప్పకుండా చూడాల్సిందే.
ఈ సీరియల్లో సీతగా వైష్ణవి, రామ్‌గా సమీర్ నటిస్తున్నారు. మహాలక్ష్మిగా బలమైన పాత్రలో పలు సీరియళ్లతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన మంజుల పరిటాల నటించడం విశేషం. ఇక, సీత తండ్రి శివకృష్ణ పాత్రలో ప్రముఖ నటుడు ఇంటూరి వాసు కనిపించనున్నారు. వీరి మధ్య సాగే సరికొత్త కథను మీరూ మిస్ కాకుండా చూడండి.
సీతే రాముడి కట్నం సీరియల్ ప్రారంభంతో మిగతా సీరియల్స్ ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. ఊహలు గుసగుసలాడే మధ్యాహ్నం 3 గంటలకు, రాధకు నీవేరా ప్రాణం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రసారమవుతాయి. జీ తెలుగు ప్రేక్షకులు దయచేసి గమనించగలరు. దేవతలారా దీవించండి సీరియల్ సమాప్తం కానుంది.
అందంపై వ్యామోహపడే అత్తని కోడలు సీత ఎలా మెప్పిస్తుంది? సరికొత్త అత్తాకోడళ్ల సీరియల్, ‘సీతే రాముడి కట్నం’, అక్టోబర్ 02 నుంచి సోమవారం – శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు, మీ జీ తెలుగులో!