పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న జీ తెలుగు ఓంకారం ఆధ్యాత్మిక ప్రయాణం

తెలుగు ఇండస్ట్రీలో అత్యంత వినోదాత్మక ఛానల్స్ లో ఒకటైన జీ తెలుగు ఎప్పుడూ విలక్షణమైన ఫిక్షన్, నాన్ ఫిక్షన్ షోలు, బ్లాక్ బస్టర్ సినిమాలు, ఆధ్యాత్మిక, భక్తి కార్యక్రమాలతో ముందుంటుంది. జీ తెలుగు అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక మరియు భక్తి కార్యక్రమాలలో ఒకటైన ఓంకారం విజయవంతంగా పదేళ్లు పూర్తి చేసుకుంది. ప్రేక్షకుల్లో భక్తిభావం నింపే ఓంకారం ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, మీ జీ తెలుగులో!
2003 డిసెంబర్ 12న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో దేవిశ్రీ గురూజీ భక్తులకు ఆధ్యాత్మిక సమాచారాన్ని అందిస్తున్నారు. ఓంకారం జ్యోతిషం మరియు ఆధ్యాత్మికత గురించి సమాచారాన్ని అందించే ఆధ్యాత్మిక కార్యక్రమంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ షోలో దేవిశ్రీ గురూజీ రామల శాస్త్రం ఆధారంగా జ్యోతిష్య పరిష్కారాలను అందిస్తున్నారు. పూజలు ఎలా చేయాలి? వాటి ప్రయోజనాలు ఎలా పొందాలి? జాతకంలో ఎదురయ్యే అడ్డంకులను ఎలా అధిగమించాలి? వ్యాపారంలో ఎలా వృద్ధి సాధించాలి తోపాటు ఇతర జ్యోతిష్య ప్రశ్నలకూ ఈ కార్యక్రమం ద్వారా గురూజీ సమాధానాలు అందిస్తున్నారు.
యాంకర్ ప్రియ ఈ కార్యక్రమానికి 10 సంవత్సరాల నుంచి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం తాజాగా పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పీసీఆర్, కెమెరా విభాగంలోని టెక్నీషియన్లు ఆరంభం నుంచి ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. తెలుగు ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని అమితంగా ఆదరిస్తూ విజయవంతంగా కొనసాగడంలో తోడ్పడ్డారు.
ఈ కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యాంకర్ ప్రియ మాట్లాడుతూ-‘’ఓంకారం’… కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు. ప్రతినిత్యం ఆరోజు తిథి, వార, నక్షత్రాలను తెలియజేయడం, ఆరోజు ఏ దైవనామ స్మరణ చేస్తే ఏ ఫలితం కలుగుతుందీ, మంచిమాట, ఒక ఫోన్ కాలర్ సమస్యకు పరిష్కారం తెలపడం, నీతితో కూడిన చిన్నకథ, వాస్తుకు సంబంధించిన పరిష్కారాన్ని తెలియజేయడం, ఆయుర్ క్షేమంలో మన ప్రకృతి అందించిన సంపద ద్వారా మన ఆరోగ్యాన్ని సంరక్షించుకునే మార్గం, ప్రతినిత్యం ఆచరించాల్సిన పరిహారం… ఇలా అన్నింటినీ కలగలిపి డా.దేవిశ్రీ గురూజీ అందిస్తున్న ‘ఓంకారం’ కార్యక్రమం అత్యంత ప్రేక్షకాదరణ పొందడం నిజంగా సంతోషించదగిన విషయం. ఇటువంటి కార్యక్రమానికి నేను ఇన్నేళ్లుగా యాంకర్ గా కొనసాగడం నా అదృష్టమనే చెప్పాలి’ అన్నారు.
ఆధ్యాత్మిక ప్రయాణం ఓంకారం.. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు జీ తెలుగులో మాత్రమే!