Yukthi Thareja: గ్రీన్ శారీలో మరింత అందంగా యుక్తి
మోడలింగ్, మ్యూజిక్ వీడియోలతో బాగా పాపులర్ అయిన యుక్తి తరేజా(Yukthi Thareja) ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేయాలని చూస్తోంది. అందులో భాగంగానే తన ప్రయత్నాలు చేస్తున్న యుక్తి తరేజా ఇప్పుడు కింగ్ జాకీ క్వీన్(King Jackie Queen) అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాలో యుక్తి కేవలం గ్లామర్ పాత్రకే పరిమితం కాకుండా మంచి నటనను కనబరచనుందని రీసెంట్ గా రిలీజైన టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యుక్తి తాజాగా గ్రీన్ శారీలో మెరిసింది. వినీతా పర్యానీ రూపొందించిన ఈ శారీ ఫ్లవర్ ఎంబ్రాయిడరీతో ఎంతో అందంగా ఉంది. ఈ ట్రాన్స్పెరెంట్ శారీలో యుక్తి మరింత అందంగా కనిపిస్తుందని నెటిజన్లు ఆమె ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తూ ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.






