Sobhita Dhulipala: సింపుల్ లుక్ లో సూపర్ ఎట్రాక్టివ్ గా అక్కినేని కోడలు

తెలుగమ్మాయి, టాలీవుడ్ హీరోయిన్, అక్కినేని కోడలు శోభిత ధూళిపాల(Sobhita Dhulipala) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టిన శోభిత తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు అందుకుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే శోభిత ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా శోభిత తమిళనాడు వెళ్లి అక్కడి విలేజ్ కల్చర్ ను ఎంజాయ్ చేస్తోంది. సింపుల్ జీన్స్, దానిపై టీ షర్ట్ వేసుకుని అక్కడి ఉన్న వారితో మాట్లాడుతూ, పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ కనిపించింది శోభిత. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు ఈ ఫోటోలకు సూపర్ సింపుల్ అంటూ కామెంట్స్ చేస్తూ లైకులు కొడుతున్నారు.