Gowtham Ghattamaneni: మహేష్ కొడుకుపై నెట్టింట విమర్శలు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కు ఎంతటి క్రేజ్, ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయనతో పాటూ ఆయన ఫ్యామిలీ మొత్తానికి కూడా మంచి క్రేజ్ ఉంది. ఎప్పుడూ ఫ్యామిలీతో వెకేషన్స్ కు వెళ్లడం మహేష్ కు అలవాటు. ఆ విధంగానే మహేష్ కొడుకు గౌతమ్(Gowtham), కూతురు సితార(Sithara) కూడా బాగా ఫేమస్ అయ్యారు.
అలాంటి గౌతమ్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. గౌతమ్ న్యూయార్క్ లో తన పై చదువులు చదువుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే రీసెంట్ గానే గౌతమ్ ఓ షార్ట్ ఫిల్మ్ చేశాడు. ఆ షార్ట్ ఫిల్మ్ లో గౌతమ్ ఇండియన్స్ జెర్సీలో కనిపించగా, తన పక్కన ఓ అమ్మాయి పాకిస్తాన్ జెర్సీ లో కనిపించింది.
ఆ అమ్మాయితో గౌతమ్ సరసాలాడుతూ కనిపించాడు. పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో గౌతమ్ పాకిస్తాన్ అమ్మాయితో గౌతమ్ ఇలా చేయడమేంటని అందరూ అతనిపై విమర్శలు కురిపిస్తున్నారు. అయితే గౌతమ్ దాన్ని ప్రాజెక్టులో భాగంగా చేశాడని, ఆ షార్ట్ ఫిల్మ్ షూట్ చేసి చాలా కాలమవుతుందని చెప్తున్నారు. ఈ విషయంలో గౌతమ్ కానీ, అతని తల్లిదండ్రుల నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.






