Ghaati: ఘాటీ మరోసారి వాయిదా? కారణం ఏంటంటే

సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) క్రేజ్ గురించి, ఆమెకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాహుబలి(baahubali) సినిమాల తర్వాత స్పీడు పెంచుతుందనుకుంటే ఎవరూ ఊహించని విధంగా అమ్మడు తన సినిమాల వేగాన్ని బాగా తగ్గించింది. దీంతో సినిమా సినిమాకీ బాగా గ్యాప్ ఏర్పడింది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(miss Shetty Mr. Polishetty) తర్వాత అనుష్క నుంచి మరో సినిమా రాలేదు.
ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi)తో కలిసి ఘాటీ(ghaati) అనే సినిమాలో నటించింది స్వీటీ. ఈ సినిమా ఇప్పటికే రిలీజవాల్సింది కానీ పలు కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ జులై 11న రిలీజ్ ను ఫిక్స్ చేసుకుంది. అంటే రిలీజ్ కు పది రోజులు కూడా లేదు. కానీ చిత్ర యూనిట్ ఇప్పటివరకు ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది లేదు.
దీంతో ఈసారి కూడా ఘాటీ వాయిదా పడినట్టు టాక్ వినిపిస్తోంది. ఇంకా సినిమాకు సంబంధించిన సీజీ పనులు పెండింగ్ ఉన్న కారణంతో ఘాటీ రిలీజ్ మరోసారి వాయిదా పడుతున్నట్టు తెలుస్తోంది. సీజీ వర్క్స్ పూర్తయ్యాక కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. విద్యా సాగర్(Vidya Sagar) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్(UV Creations) భారీ బడ్జెట్ తో నిర్మించింది.