Tollywood: ఇప్పుడైనా సినిమా వాళ్ళు ఏపీ వెళ్తారా…?

గతంలో సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు రావాలని 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) అనేక సందర్భాల్లో విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. అయినా సరే తెలుగు సినిమా పరిశ్రమ మాత్రం ఆయన మాటను అసలు ఎక్కడ లెక్క చేయలేదు అప్పట్లో. తాను రాయితీలు కూడా ఇస్తానని ప్రకటించారు. చిన్న సినిమాలకు తన నుంచి ప్రోత్సాహకాలు ఉంటాయని కూడా చంద్రబాబు నుంచి ఎన్నో ప్రకటనలు వచ్చాయి. అయినా సరే తెలుగు సినిమా పరిశ్రమ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టడానికి ఇబ్బంది పడింది.
అయితే ఇప్పుడు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) దూకుడు చూస్తున్న వాళ్ళు మాత్రం గతంలో చంద్రబాబు మాట విని ఉంటే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చి ఉండేది కాదు అనే ఒపీనియన్ కూడా వ్యక్తం చేస్తున్నారు. సినిమా వాళ్ళు వస్తే వాళ్లకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీలు ఇచ్చారు. అయితే గత ఐదేళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ కూడా సినిమా వాళ్లకు చుక్కలు చూపించరనే భావన కూడా సినీ పరిశ్రమలో ఉంది.
ఇప్పటికైనా సరే సినిమా వాళ్లు అర్థం చేసుకుని ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెడితే కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సపోర్టు ఉంటుందని సూచిస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలని సూచనలు కూడా చేశారు. అటు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టాలని కోరారు. బెనిఫిట్ షోస్ తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయడం దారుణం అని కూడా ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో సినిమా పరిశ్రమకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం కూడా కనపడటం లేదు అనే ఒపీనియన్స్ వినపడుతున్నాయి. మరి దీనిపై సినిమా పరిశ్రమ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి..