ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

‘జిన్నా’ టైటిల్ వివాదంలో అర్థం పర్థం లేదు..ధైర్యముంటే జిన్నా అనే వ్య‌క్తి నీచుడ‌ని చెప్పే సినిమా తీయండి!! : రచయిత కోన వెంకట్

‘జిన్నా’ టైటిల్ వివాదంలో అర్థం పర్థం లేదు..ధైర్యముంటే జిన్నా అనే వ్య‌క్తి నీచుడ‌ని చెప్పే సినిమా తీయండి!! : రచయిత కోన వెంకట్

విష్ణు మంచు హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘జిన్నా’ . ఈ సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 5న రిలీజ్ అవుతుంది. మూవీ టైటిల్ అనౌన్స్ చేసిన రోజున టైటిల్‌పై వివాదం న‌డిచిన సంగ‌తి తెలిసిందే. ఈ వివాదం గురించి రైట‌ర్ కోన వెంక‌ట్ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో స్పందించారు. జిన్నా టైటిల్ వివాదంతో పాటు శ్రీను వైట్ల‌తో ఉన్న మ‌న‌స్ప‌ర్ద‌ల గురించి కూడా ఆయ‌న మాట్లాడారు. విష్ణు మంచు  హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘జిన్నా’ . ఈ సినిమా ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 5న రిలీజ్ అవుతుంది. మూవీ టైటిల్ అనౌన్స్ చేసిన రోజున టైటిల్‌పై వివాదం న‌డిచిన సంగ‌తి తెలిసిందే. ఈ వివాదం గురించి రైట‌ర్ కోన వెంక‌ట్) రీసెంట్ ఇంట‌ర్వ్యూలో స్పందించారు. జిన్నా టైటిల్ వివాదంతో పాటు శ్రీను వైట్ల‌తో ఉన్న మ‌న‌స్ప‌ర్ద‌ల గురించి కూడా ఆయ‌న మాట్లాడారు.

‘‘జిన్నా’ టైటిల్ వివాదంలో అర్థం పర్థం లేదు. బీజేపీ లీడ‌ర్ విష్ణు వ‌ర్ధ‌న్ రెడ్డిగారు జిన్నా అనే వ్య‌క్తి నీచుడు, నికృష్ణుడు, మ‌న దేశ విభ‌జ‌న‌కు కార‌ణ‌మైనోడు అని లైవ్‌లో మాట్లాడుతున్న‌ప్పుడు నేను విన్నాను. జిన్నా అనే వ్య‌క్తి నీచుడ‌ని చెప్పే సినిమా తీయండి. మేం స‌పోర్ట్ చేస్తాం. అలాంటి ఓ క‌థ రాయండని అన్నారు. దానికి నేను మాట్లాడుతూ ‘సార్ అద్భుతమైన ఐడియా. నా నెక్ట్స్ స్క్రిప్ట్ ఇదే. మీరే ప్రొడ్యూసర్ అన్నాను. మీరు సినిమాను నిర్మిస్తే నేను కథ రాస్తాను’ అని అన్నాను. జిన్నా అంటే జి.నాగేశ్వరరావు అని క్లియర్‌గా చెప్పాం. దానిపై వివాదం చేయాల్సిన అవసరం ఏముంది. అదే జిన్నా అనేది తిరుపతిలో పెరిగిన ఓ ముస్లిం క్యారెక్టర్ అయ్యుంటే అప్పుడు ఆ వివాదంలో అర్థముండేది. అంతకు ముందు విష్ణు హిట్ చిత్రాలు ఢీ, దేనికైనా రెఢీ చిత్రాలకు నేనే రైటర్. దాదాపు ఏడేళ్ల తర్వాత మళ్లీ మా కాంబోలో వస్తోన్న ఈ సినిమా కోసం మోహన్ బాబుగారింట్లోకి అడుగు పెట్టాను. నా వర్క్‌తో ఆయన్ని కలవటానికి కుదరలేదు. నన్ను నమ్మి ఈ సినిమా చేయమని చెప్పాను’’ అన్నారు. 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :