ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

న్యూజెర్సిలో ఘనంగా అలయ్‌ బలయ్‌

న్యూజెర్సిలో ఘనంగా అలయ్‌ బలయ్‌

తెలంగాణా అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌, టిటిఎ వ్యవస్థాపకులు డా’ పైళ్ల మల్లారెడ్డి అశీస్సులతో, అడ్వైజరీ చైర్‌ డా విజయపాల్‌ రెడ్డి, అడ్వైజరీ కో చైర్‌ మోహన్‌ రెడ్డి పట్లోళ్ల, అడ్వైజరీ మెంబర్‌ భరత్‌ మాదాడిలు మొట్టమొదటి సారిగా తెలంగాణకి ప్రీతీ పాత్రమైన అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని అమెరికాలోని వివిధ నగరాల్లో జరపాలని నిర్ణయించారు. టిటిఎ అధ్యక్షులు వంశీ రెడ్డి అధ్యక్షతన జరిగిన టిటిఎ అలయ్‌ బలయ్‌ కు వివిధ నగరాలలో జనం పెద్ద ఎత్తున పోటెత్తారు.

టిటిఎ కో చైర్‌ మోహన్‌ రెడ్డి పట్లోళ్ల స్వంత రాష్టం న్యూజెర్సీ లో అలయ్‌ బలయ్‌ సంబరాలు అంబరాన్ని అంటాయి. టిటిఎ జాయింట్‌ సెక్రటరీ శివా రెడ్డి కొల్ల మరియు బోర్డు అఫ్‌ డైరెక్టర్స్‌ సుధాకర్‌ ఉప్పల, నర్సింహ పెరుక, నరేందర్‌ యారవ నేతృత్వంలో టిటిఎ న్యూజెర్సీ రీజినల్‌ వైస్‌ ప్రెసిడెంట్స్‌ మధుకర్‌ రెడ్డి, సాయి గుండూర్‌ ఆధ్వర్యమున సైరేవిల్లేలో శనివారం, ఆగస్టు 19, 2023 న నిర్వహించిన సంబరాలు 500 మంది ఆహుతులతో అంబరాన్ని అంటేలా సాగింది.

అలయ్‌ బలయ్‌ అంటేనే ఆత్మీయ పలకరింపు, తెలంగాణ సంస్కృతికి ప్రత్యేకమైన ఆహారం మరియు సాంప్రదాయ వినోదాన్ని కలుగచేయటం, అలయ్‌ బలయ్‌ సంబరాల్లో టిటిఎ మెంబర్‌ షిప్‌ చైర్‌ అరుణ్‌ అర్కాల నేతృత్వంలో ప్రత్యేకంగా తయారు చేసిన చక్కటి తెలంగాణ విందు భోజనం మైమరపింపజేసింది. అదేవిదంగా అలయ్‌ బలయ్‌ కండువాలు ధరించి ఒకరికొకరు ఆత్మీయ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం అమెరికా లో జరుగుతుందా లేక తెలంగాణ లోన అన్నట్లు కనిపించింది. అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో చిన్నపిల్లలు చాల ఉత్సాహంగా పాల్గొన్నారు,

టిటిఎ యూత్‌ టీం సభ్యులు ఇషితా మూలే, మోక్ష మాలి, రిషిత జంబుల, సహస్ర ఎల్లంపల్లి, హాసిని అర్కాల, కీర్తి పేరుక, నిమిషా పేరుక అట పాటలు నిర్వహించారు.

అలాగే ప్రముఖ తెలుగు సింగర్‌ స్ఫూర్తి జితేందర్‌ ఈ కార్యక్రమంలో తన పాటలతో ఆహుతులను ఆకట్టుకున్నారు. అలాగే టిటిఎ న్యూ జెర్సీ టీం, టీటీఎ కమ్యూనిటీ సర్వీసెస్‌ టీం చైర్‌ నర్సింహా పెరుక అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి హాజరు అయిన సీనియర్‌ సిటిజన్స్‌ ను సన్మానించి పెద్దలపైన తమకు ఉన్న గౌరవాన్ని చాటిచెప్పారు.

అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా న్యూజెర్సి మిడిల్‌ సెక్స్‌ కౌంటీ డైరెక్టర్‌ శాంతి నర్రా, న్యూజెర్సి బోర్డ్‌ ఆఫ్‌ పబ్లిక్‌ యుటిలిటిస్‌ మాజీ కమిషనర్‌ ఉపేంద్ర చివుకుల, ఎడిసన్‌ టౌన్‌ షిప్‌ కౌన్సిల్‌ మేన్‌ అజయ్‌ పాటిల్‌, టిటిఎ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నర్సింహా రెడ్డి దొంతిరెడ్డి తదితరులు టిటిఎ సభ్యులను ఈవెంట్‌ కి హాజరు అయిన అతిధులను ఉద్దేశించి ప్రసంగించారు.

వివిధ తెలుగు ఆర్గనైజషన్స్‌ టిఫాస్‌, ఆటా, నాట్స్‌, తానా ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి తరలివచ్చి అందరికీ అలయ్‌ బలయ్‌ శుభాకాంక్షలు తెలిపారు. టిటిఎ న్యూ జెర్సీ టీం సభ్యులు అరుణ్‌ అర్కాల, ప్రశాంత్‌ నలుబంధు, నవీన్‌ కౌలూరు , శంకర్‌ రెడ్డి వులుపుల, రాజా నీలం, శ్రీనివాస్‌ రెడ్డి మాలి, శ్రీనివాస్‌ జక్కిరెడ్డి, ప్రణీత్‌ నల్లపాటి , శివ నారా, వెంకీ, సుమంత్‌, దీప జలగం, సంధ్య కాసుల, నవీన్‌ యలమండల, కృష్ణ మోహన్‌ రెడ్డి, అష్రిత్‌ వచ్చిన వారి అందరికి ధన్యవాదాలు తెలియజేశారు.

 

Click here for Photogallery

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :