ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

'ఆర్టికల్ 370' రద్దు రాజ్యాంగబద్ధమే..

'ఆర్టికల్ 370' రద్దు రాజ్యాంగబద్ధమే..

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ‘ఆర్టికల్‌ 370’ రద్దు రాజ్యాంగబద్ధమేనంటూ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ‘‘జమ్మూకశ్మీర్‌ పై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేయలేరు. భారత్‌లో విలీనం తర్వాత జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదు. అప్పట్లో యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఆర్టికల్‌ 370ని ప్రవేశపెట్టారు. అది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే గానీ.. శాశ్వతం కాదు. దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. హక్కుల విషయంలో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేకత ఏమీ లేదు. మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో అది సమానమే. ఆర్టికల్ 1, ఆర్టికల్‌ 370 ప్రకారం జమ్మూకశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమే’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ తీర్పును వెలువరించారు.

జమ్మూకశ్మీర్‌ నుంచి లద్దాఖ్‌ను విభజించి దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే, ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రహోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. 2024 సెప్టెంబరు 30వ తేదీలోగా జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ‘‘ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమన్నారు ప్రధాని మోడీ. 2019 ఆగస్టు 5న భారత పార్లమెంట్‌ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు రాజ్యాంగబద్ధంగా సమర్థించింది. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ సోదరసోదరీమణుల ఆశలు, ఐక్యత, పురోగతిని ప్రతిధ్వనించే ప్రకటన ఇది. భారతీయులుగా మనమెంతో గర్వపడే ఐక్యతను కోర్టు మరోసారి బలపర్చింది.

జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ ప్రజల కలలను నెరవేర్చేందుకు మేం నిబద్ధతతో ఉన్నాం. ఆర్టికల్‌ 370తో నష్టపోయిన వారందరికీ అభివృద్ధి ఫలాలను అందిస్తాం. ఈ రోజు తీర్పు కేవలం చట్టపరమైనది మాత్రమే కాదు.. రానున్న తరాలకు ఇదో ఆశాకిరణం. ఉజ్వల భవిష్యత్తుకు వాగ్దానం. బలమైన ఐక్యభారతాన్ని నిర్మించాలనే మన సంకల్పానికి నిదర్శనం’’ అని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పును బీజేపీ, శివసేన స్వాగతిస్తుండగా.. పలు పార్టీల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తీర్పు విచారకరం. దీనిపై జమ్మూకశ్మీర్‌ ప్రజలు సంతోషంగా లేరు. కానీ సుప్రీం తీర్పును మనం అంగీకరించాల్సిందే అన్నారు.

జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం గులామ్‌ నబీ ఆజాద్‌ ‘‘తీర్పుతో అసంతృప్తిగా ఉన్నాం. కానీ నిరుత్సాహపడట్లేదు. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడానికి బీజేపీకి కొన్ని దశాబ్దాలు పట్టింది. మేం కూడా సుదీర్ఘ పోరాటానికి సిద్ధపడుతున్నాం. దీనిపై మా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్‌ను కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జమ్మూకశ్మీర్‌కు చెందిన పలు పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి సుదీర్ఘంగా విచారణ జరిపింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :